దర్శకుడు బాలా నన్ను దెబ్బకొట్టాడని ఏడుస్తోంది
తెలుగులో క్లిక్ కానీ మధుషాలినికి దర్శకుడు బాల తన చిత్రం'వాడు-వీడు" లో వేషం ఇచ్చేసరికి ఎక్కడలేని ఆనందం వచ్చేసింది. అందులోనూ విశాల్, ఆర్య నటిస్తున్న మల్టి స్టారర్ సినిమా, తను బిజీ అయ్యే సమయం వచ్చేసిందని మురిసిపోయింది. అంతే ఆవేశంగా దాదాపుగా 250 రోజుల కాల్ షీట్స్ ఇచ్చేసింది. నటించేటప్పుడు ఇంత పెద్ద పాత్రలో నటిస్తున్నాను కనుక తమిళంలో, డబ్బింగ్ అవుతున్న తెలుగులో బిజీ అవుతానన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరై,వచ్చిన చిన్నా చితకా ఆఫర్స్ ని ప్రక్కన పెట్టేసింది.
కానీ సినిమా విడుదలయ్యాక తన పాత్ర కేవలం పది నిముషాలే ఉండడం చూసి షాక్ అయింది. సెన్సార్ సమస్యలు లేకపోయినా తాను నటించిన పాటలను సన్నివేశాలను ఎందుకు తొలగించారో అర్ధంకాని పరిస్థితిని ఎదుర్కొంటోంది. అసలు కావాలనే ఎవరేనా ఇలా చేశారా లేక లెంగ్త్ ఎక్కువై దర్శకుడు తన పాత్రను తగ్గించాడా అనే విషయం మీద మధనపడుతోంది. కనీసం చిత్రంలో ఒక్క పాట కూడా తనపై లేకపోవడం ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఆమెని. మొత్తానికి కష్టపడ్డా ఫలితం రాలేదని ఏడుస్తోంది.కాని సినిమా ప్రమోషన్ కి మాత్రం హాజరవుతోంది. తప్పదు కదా.


Click it and Unblock the Notifications











