క్రిష్ 'వేదం' తమిళ రీమేక్ టాక్ ఏంటి?
అల్లు అర్జున్, క్రిష్ ల కాంబినేషన్ లో వచ్చి విజయవంతమైన వేదం చిత్రం తమిళంలోకి రీమేక్ అయిన సంగతి తెలిసిందే. వానమ్ టైటిల్ తో రీమేక్ అయిన ఈ చిత్రం క్రితం శుక్రవారం విడుదలైంది. అక్కడ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అక్కడ రివ్యూలన్నీ ఈ చిత్రానికి చాలా పాజిటివ్ గా స్పందించాయి. అంతా ఎక్సలెంట్ మూవి అని కొనియాడుతున్నారు. వారు రాసిన దాంట్లో చాలా కాలం తర్వాత తమిళ ప్రేక్షకులు ఓ మీనింగ్ ఫుల్ సినిమాను చూడగలిగారు. అలాగని ఈ చిత్రం హాఫ్ బీట్ కాదు. పూర్తి కమర్షియల్ విలువలతో కూడి ఉన్నది. ఈ చిత్రంలో కామిడీ, రొమాన్స్, సెంటిమెంట్స్, సస్పెన్స్, వీటితో పాటు టెర్రిఫిక్ మెసేజ్ ఉంద అంటూ పొగిడాయి. తెలుగులోనూ ఈ చిత్రం మంచి పేరు తెచ్చుకుంది కాని కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. కాని అక్కడ పరిస్ధితి చూస్తుంటే డిస్టిబ్యూటర్స్ కీ, నిర్మాతలకు బాగా మిగిలేటట్లు ఉందని అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ సూపర్ స్టార్ గా పేరున్న శింబు కేబుల్ రాజు పాత్రను పోషిస్తే సరోజ పాత్రను తెలుగులో చేసిన అనుష్క చేసి పండించింది. ఆమె పాత్రకు మంచి అప్లాజ్ వస్తోంది.


Click it and Unblock the Notifications











