మరో గెలుపు కోసం వస్తున్నాడు...!?
జీవా కథానాయకుడిగా తమిళంలో నటించిన 'వందాన్ వెండ్రాన్" చిత్రాన్ని నిర్మాత కెవివేణుగోపాల్ 'వచ్చాడు గెలిచాడు" పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఆర్ కణ్ణన్ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ ప్రథమార్థంలో తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కెవి వేణుగోపాల్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'ప్రస్తుతం ఈ చిత్రం రీరికార్డింగ్ కార్యక్షికమాల్ని జరపుకుంటోంది. ఇటీవల విడుదలైన ఆడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. థమన్ అందించిన బాణీలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో జీవా బాక్సర్ గా అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ఓ లక్ష్యం కోసం బాక్సర్ గా మారి తన జీవితాశయాన్నిసాధించి ప్రజల ఆదరణ పొందే యువకుడిగా పవర్ ఫుల్ పాత్రలో ఆయన కనిపిస్తాడు. థమన్ సంగీతం సినిమాకి ప్రధానాకర్షణగా నిలుస్తోంది. 'రంగం"తో తెలుగులో మంచి విజయాన్ని సొంతంచేసుకున్న జీవా ఈ చిత్రంలో వైవిధ్యమైన నటనను కనబర్చాడు" అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్ కణ్ణన్


Click it and Unblock the Notifications











