అయిదు పెళ్లిళ్లు చేసుకున్న దర్శకుడు...అరెస్టు

అందులో రవితో తనకు వివాహమైందని, తమకు ఏడేళ్ల పాప ఉందని పేర్కొన్నారు. ఆయనకు ఆపరసాలైకి చెందిన ఓ మహిళతో వివాహమైందని, వారికి పద్దెనిమిదేళ్ల కుమార్తె కూడా ఉందని ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా మార్తాండానికి చెందిన అనిత, తిరువనంతపురానికి చెందిన బింధు, కవితను కూడా వివాహం చేసుకున్నాడని తెలిపారు. తర్వాత తనను పెళ్లి చేసుకుని మోసగించాడని పేర్కొన్నారు.
తాజాగా తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో నటించేందుకు ఆసక్తిగల యువతులు సంప్రదించాలని మళ్లీ ప్రకటన కూడా ఇస్తున్నాడని తెలిపారు. అతడి వలలో అమాయకులు పడకుండా చూడాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపి ఆదివారం తెల్లవారుజామున కన్యాకుమారి జిల్లా సరిహద్దులోని ఓ టోలుగేటు వద్ద రవిని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











