twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వడ చెన్నై పబ్లిక్ టాక్.. ధనుష్ ఇరుదీశాడు.. కెరీర్‌లోనే అత్యుత్తమ నటన

    |

    దర్శకుడు వెట్రిమారన్, విలక్షణ నటుడు ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన వడ చెన్నై చిత్రానికి రిలీజ్ ముందే మంచి క్రేజ్ ఏర్పడింది. భారీ అంచనాలతో దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 17న రిలీజైంది. ధనుష్ సరసన ఐశ్వర్య రాజేష్, అమీర్, ఆండ్రియా, కిషోర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి తొలి ఆట నుంచే భారీ స్పందన లభిస్తున్నది. సోషల్, ఇంటర్నెట్ మీడియాలో పబ్లిక్ వెల్లడిస్తున్న టాక్ మీ కోసం..

    వడ చెన్నై కథేంటంటే..

    వడ చెన్నై కథేంటంటే..

    అంబు (ధనుష్) జాతీయ స్థాయి క్యారమ్ ప్లేయర్. ఉత్తర చెన్నైలోని గ్యాంగస్టర్స్‌తో అంబుకి విభేదాలు ఏర్పడుతాయి. మాఫియా ట్రాప్‌లో పడిన అంబు జీవితం ఎలాంటి ఆటుపోట్లకు గురైంది. మాఫియాను ఎలా ఎదురించాడనేది ఈ సినిమా కథ. ఈ చిత్రంలో మాఫియాతో రాజకీయ నేతల సంబంధాలు, గ్యాంగ్‌స్టర్ల ఉత్తాన పతనాలును చక్కగా తెరకెక్కించడంలో దర్శకుడు వెట్రిమారన్ సక్సెస్ అయ్యాడనే మాట వినిపిస్తున్నది.

     ఉత్తర మద్రాస్‌లో సంఘటనలు

    ఉత్తర మద్రాస్‌లో సంఘటనలు

    ఉత్తర మద్రాస్‌లో జరిగిన యదార్థ సంఘటనలతో ఈ సినిమాను వెట్రిమారన్ తెరకెక్కించాడు. నాటు కథను ఒరిజినల్ తెరపైన చూపించాడనే మాట వినిపిస్తున్నది. సన్నివేశాలు సహజసిద్ధంగా ఉండటం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది. కలుషిత రాజకీయాలు ప్రేక్షకుడిని ఆలోచింపజేసే విధంగా ఉంది.

    రియాలిటీకి, సహజత్వానికి దగ్గరగా

    రియాలిటీకి, సహజత్వానికి దగ్గరగా

    మాస్ క్యారెక్టర్లతో రియాలిటీకి దగ్గర కథ, కథనాలు వడా చెన్నై చిత్రానికి బలంగా మారాయి. అంబు పాత్రలో ధనుష్ ఒదిగిపోయాడు. కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ధనుష్, ఐశ్వర్య రాజేష్ కెమిస్ట్రీ బాగా పండింది.

     బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా

    బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా

    అమీర్, అండ్రియా, సముద్రఖని, కిషోర్ పాత్రలు సినిమాకు సపోర్ట్‌గా నిలిచాయి. సంతోష్ నారాయన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ డిజైన్, సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫి ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అని నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

    మూడు పార్టులుగా

    మూడు పార్టులుగా

    వడా చెన్నైను మూడు పార్టులగా తెరకెక్కించబోతున్నారు. ధనుష్‌తో ఫస్ట్ పార్ట్‌ అక్టోబర్ 17న విడుదల కాగా, పార్ట్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను తొలుత శింబుతో తీయాలని వెట్రిమారన్ అనుకొన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ధనుష్‌తో సాధ్యపడింది.

    English summary
    Vetrimaaran and Dhanush's much-hyped Vada Chennai has opened to highly positive reviews from the critics and audience. Aishwarya Rajesh, Ameer, Andrea, Kishore and others in the cast. A rustic original story on gangsters in North Madras and stays true to its genre. The movie is filled with raw moments and the detailing in the screenplay make it a cult gangster film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X