గుండెపోటుతో యంగ్ కమెడియన్ మృతి.. విషాదంలో సినీ ప్రముఖులు
సినిమా ఇండస్ట్రీలో వరుసగా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అవి ఏ భాషలో, ఏ రాష్ట్రంలోనైనా సరే గానీ సెలెబ్రిటీలు మాత్రం అకాల మరణం చెందుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నే టాలీవుడ్ ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి మృత్యువాత పడ్డారు.గుండెపోటుతో మరణించిన జయప్రకాష్ రెడ్డికి టాలీవుడ్ ప్రముఖులంతా సంతాపాన్ని వ్యక్తం చేశారు. నేడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ విషాదం నెలకొంది.
వడివేల్ బాలాజీ అనే యువ కమెడియన్ మరణించాడు. గుండెపోటుతో నేడు ఆయన మృతి చెందాడు. ఇన్ని రోజులు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఆర్థిక సమస్యలతో ఈ రోజు ఉదయమే ప్రభుత్వ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారట. ఇక పరిస్థితి చేజారిపోవడంతో వడివేల్ బాలాజీ ఈ లోకాన్ని వదిలివెళ్లాడు. అతనికి భార్య ఓ బాబు, ఓ పాప ఉన్నారు. వడివేల్‌ను బాగా ఇమిటేట్ చేస్తూ వినోదాన్ని పంచడంతో వడివేల్ బాలాజీగా పేరు పొందారు.

టీవీ రంగం నుంచి వెండితెరకు పరిచమయ్యాడు. శివ కార్తికేయన్ హోస్ట్‌గా వ్యవహరించిన షోలో వడివేల్ పార్టిస్టిపేట్ చేశాడు. అలా మొదలైన వారి పరిచయంతో సినీ అవకాశాలు వచ్చాయి. అదు ఇదు ఎదు అనే షో, కలక పోవదు యారు అనే షోలో వడివేల్ గుర్తింపు సంపాదించుకున్నాడు. శివ కార్తికేయన్, నయన్ కాంబోలో వచ్చిన కొలమావి కోకిల సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.


Click it and Unblock the Notifications











