దర్శకుడు వేధిస్తున్నారంటూ హాస్యనటుడు పిర్యాదు
ప్రముఖ హాస్య నటుడు వడివేలు తమిళ నిర్మాతల సంఘంలో దర్శక,నిర్మాత శక్తి చిదంబరంపై పిర్యాదు చేసారు. తను ఇచ్చిన కాల్ షీట్స్ వాడుకోకుండా మురగపెట్టుకుని, ఇప్పుడు డేట్స్ కావాలంటూ తనను వేధిస్తున్నాడని ఆ కంప్లైంట్ లో ఉంది.ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కొద్ది నెలల క్రిందట గురు..శిష్యన్ అనే చిత్రం కోసం వడివేలు కాల్ షీట్స్ అడిగారు శక్తి చిదంబరం. వడివేలు చేయటానికి సరే అని అడ్వాన్స్ తీసుకుని డేట్స్ కేటాయించారు. అయితే శక్తి చిదంబరం తానే నిర్మాత కావటంతో డబ్బు ఎడ్జెస్ట్ కాక ఆ డేట్స్ వాడుకోలేకపోయాడు. నాలుగు నెలలు అనంతరం ఆ చిత్రం మొదలుపెట్టాలని వడివేలుని సంప్రదించాడు. అయితే తనికి ఇప్పుడు ఖాళీ లేదని అడ్వాన్స్ తిరిగి ఇస్తానని వడివేలు చెప్పారు. నిజానికి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వల్సిన సంప్రదాయం లేదని,కానీ అతని ఇబ్బందులు గమనించి అలా చేస్తానన్నానని వడివేలు చెప్తున్నారు. అయితే శక్తి చిదంబరం ఈ విషయమై నిర్మాతల మండలికి కంప్లైంట్ చేసారు. వడివేలు అడ్వాన్స్ తీసుకుని షూటింగ్ కి అటెండ్ కావటం లేదని. దాంతో వడివేలు కూడా వెంటనే తనని వేధిస్తున్నారంటూ పిర్యాదు చేసారు. ఇరు పక్షాల వారినీ కూర్చోబెట్టి వడివేలు తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇప్పించి, ఆ ఎగ్రిమెంట్ ను కాన్సిల్ చేసే ఆలోచనలో నడిగర సంఘం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











