'ఎలుక' టైటిల్ తో నవ్విస్తానంటున్నాడు
చెన్నై : కమిడియన్స్ హీరోగా సక్సెస్ అవటం అనేది చాలా అరుదుగా జరుగుతూంటుంది. ఎందుకంటే సినిమాలో ఓ కామెడీ ట్రాక్ గా చూసిన వారిని, సినిమా అంతా భరించాలంటే చాలా కష్టం. అయితే స్క్రిప్టు బలంగా ఉన్నప్పుడు ఆ సమస్యను అధిగమించవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగులో బ్రహ్మానందం, ధన్ రాజు వంటివారు తమిళంలో వడివేలు ప్రయత్నాలు చేస్తున్నారు.
తన హాస్య చతురతతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు వడివేలు. పరిశ్రమకు రెండేళ్లపాటు దూరమైనా.. ఆయన పాత హాస్య సన్నివేశాలు ఇప్పటికీ బుల్లితెరలో ఆకట్టుకుంటున్నాయి. తర్వాత ఆయన చేసిన చిత్రం 'వడివేలు'. యువరాజ్ దర్శకత్వం వహించారు.

ఇబ్బందులను అధిగమించి ఎట్టకేలకు విడుదలైంది. ఆశించిన స్థాయిలో విజయం మాత్రం సాధించలేదు. ఆయన మళ్లీ యువరాజ్ దర్శకత్వంలో హీరోగా నటించనున్నారు. ఓహో పిక్చర్స్ పతాకంపై జి.రామ్‌కుమార్ దీన్ని నిర్మిస్తున్నారు. ఇమాన్ సంగీతం సమకూర్చుతున్నారు.
1970 కాలంలో జరిగే కథతో దీన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. పూర్తి హాస్య నేపథ్యంతో తెరకెక్కిస్తున్నామని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఇంటికెళ్లినా.. గుర్తుచేసుకున్నప్పుడల్లా నవ్వేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. కెమెరా: గోపీ అమర్‌నాథ్. ఈ చిత్రం టైటిల్ ఇలై(ఎలుక) అని ఫైనల్ చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











