ముదురుతున్న హీరో,హాస్య నటుడు వివాదం

ఇందుకు వడివేలును డీఎంకే పావుగా వాడుకొంటోందని విమర్శించారు.తమ పార్టీ అభివృద్ధిని అడ్డుకొనేందుకే డీఎంకే ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతోందని ఆరోపించారు. తమపై కేసులు పెట్టాల్సిందిగా వడివేలును డీఎంకే నేతలు ప్రేరేపించారని వ్యాఖ్యానించారు. అయితే అధికార దుర్వినియోగంతో డీఎంకే ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడబోనన్నారు.
అయితే విజయ్‌కాంత్‌పై కేసు పెట్టాల్సిందిగా తనను ఎవరూ ప్రేరేపించలేదని వడవేలు స్పష్టంచేశారు. గతంలో విజయ్‌కాంత్ హీరోగా నటించిన చిత్రాల్లో విజయ్‌శాంత్ భావి ముఖ్యమంత్రిగా డైలాగులు మాట్లాడాలని సూచించినట్టు చెప్పారు. అయితే ఇది ఇతర పార్టీల వారికి తప్పుడు సంకేతాలు పంపినట్టవుతుందని దానికి తాను అంగీకరించలేదని చెప్పారు. అందుకే విజయ్‌కాంత్ తనపై కక్షకట్టి ఇలా దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.
ఇక ఆదివారం వడివేలు ఇల్లు, కార్యాలయాలపై సుమారు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 10 మోటార్‌బైకులలో వచ్చి అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. అయితే ఎవరికీ గాయాలు ఏర్పడలేదు. . దీనికి సంబంధించి వడివేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్, ఆయన అభిమానులపై చెన్నై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ సంఘటనకు కొద్ది నెలల క్రితం డీఎండీకే కార్యకర్తలు, నటుడు వడివేలు మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం జరిగింది. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. దీనికి ప్రతీకారంగానే విజయ్‌కాంత్ అభిమానులు వడివేలు ఇంటిపై, కార్యాలయంపై దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు సైతం అనుమానించి దర్యాఫ్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











