25 కోట్లతో స్టార్ కమిడియన్ హీరోగా చిత్రం..ఫస్ట్ లుక్

By Srikanya

చెన్నై : '23మ్‌ పులికేసి' వంటి చరిత్రాత్మక కథలో నటించి.. రెండు భిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను వడివేలు కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే . గత కొంతకాలంగా తెరకు దూరమైన ఆయన ప్రస్తుతం సరికొత్తగా మళ్లీ తెరపైకి వస్తున్నారు. 'జగజ్జాల భుజబల తెనాలిరామన్‌' చిత్రంలో ఆయన శ్రీకృష్ణ దేవరాయులు, తెనాలిరాముడి పాత్రలను పోషిస్తున్నారు.

పూర్తి కామెడీ తో రూపొందే ఈ సినిమా చిత్రీకరణ 60 శాతం పూర్తయింది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఫొటోలు, వివరాలను మాత్రం గోప్యంగానే ఉంచింది యూనిట్‌. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో వడివేలు ఆహార్యం నవ్వులు పూయిస్తోంది. యువరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రూ.25 కోట్లతో తెరకెక్కిస్తోంది.

Vadivelu's 'Jagajjala Pujabala Tenaliraman' first look

దర్శకుడు మాట్లాడుతూ.. '' వడివేలు స్థాయికి తగిన చిత్రమిది. '23మ్‌ పులికేసి' మాదిరిగా మంచి విజయం సాధిస్తుంది. వడివేలు రీఎంట్రీ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మీనాక్షి దీక్షిత్‌ వడివేలు సరసన నటిస్తోంది. శివాజీ నటించిన తెనాలిరామన్‌కు దీనికి ఏమాత్రం సంబంధం లేదు''అని చెప్పారు. వచ్చే నెలలో సినిమా ఆడియోను విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇక రోజుకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకూ వసూలు చేసిన స్టార్ కమిడియన్ వడివేలు.ఆయన గత పది రోజులుగా చేతిలో ఒక్క సినిమా కూడా లేక పూర్తి ఖాళిగా ఉన్నాడు. దానికి కారణం రజనీకాంత్ తో వడివేలు తగువు పెట్టుకోవటమే.రజనీ నటించాల్సిన 'రాణా' చిత్రం నుంచి వడివేలును తొలగిస్తున్నట్లు ప్రకటించారు. రజనీకాంత్ అన్నాడీఎంకే గుర్తుపై ఓటేసినట్లు మీడియాలో పొక్కడంతో అసహనానికి గురైన వడివేలు.. 'రజనీ గిజనీ జాన్తానై.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినరోజు వీరందరి సంగతి తేలుస్తా' అని ప్రకటించారు. ఇది కూడా పరిశ్రమలోని రజనీ మద్దతుదారుల కోపానికి కారణమైంది. ఈ నేపథ్యంలో వడివేలుకు ఒక్క సినిమా కూడా లేకపోయింది. గతంలోనూ మరో స్టార్ హీరో విజయ్ కాంత్ తో తగువు పెట్టుకున్నాడు. ఆ గొడవ వడివేలు నివాస స్దలం వద్ద మొదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X