వైభవంగా బాహుబలి సింగర్ వైకోమ్ విజయలక్ష్మి వివాహ వేడుక (ఫోటోస్)
బాహుబలి సింగర్ వైకోమ్ విజయలక్ష్మి వివాహ వేడుక కేరళలోని వైకోమ్ మహాదేవ ఆలయంలో సోమవారం ఘనంగా జరిగింది. మిమిక్రి ఆర్టిస్ట్, ఇంటీరియర్ డిజైనర్ అనూప్‌ను ఆమె పెళ్లాడారు. సెప్టెంబర్లో విజయలక్ష్మి-అనూప్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
వీరి వివాహ వేడుకకు సినీ, సంగీత రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ గాయకుడు యేసుదాసు తన భార్య ప్రభ, కుమారుడు విజయ్‌తో విచ్చేయగా, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎం జయచంద్రన్, ఔసెప్పచ్చన్, ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

పుట్టుకతోనే అంధురాలు
కేరళలోని వైకోమ్‌లో జన్మించిన విజయలక్ష్మి పుట్టుకతోనే అంధురాలు. తర్వాత ఆమె కుటుంబం చెన్నై షిప్టయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె సంగీత రంగంలో తన సేవలు అందిస్తున్నారు. గడిచిన పదేళ్లలో 400లకుపైగా స్టేజ్ షోలు ఇచ్చారు.

వైకోమ్ విజయ లక్ష్మి
వైకోమ్ విజయలక్ష్మి కేవలం సింగర్ మాత్రమే కాదు... గాయిత్రివీణ వాయించడంలో ఎక్స్‌పర్ట్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీ తమిళ వెర్షన్లో ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ‘శివ శివాయ పోత్రి' అనే పాటను పాడారు.

లక్షల్లో అభిమానులు
వైకోమ్ విజయలక్ష్మి పాటలకు లక్షల్లో అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె ఫాలోయే అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువే. ఆమె ఫేస్ బుక్ అఫీషియల్ పేజీకి 1 మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

గతంలో ఎంగేజ్మెంట్ రద్దు
2016లో సింగర్ వైకోమ్ విజయ లక్ష్మి ఎంగేజ్మెంట్ సంతోష్ అనే వ్యక్తితో జరిగింది. అయితే పలు కారణాలతో వీరి వివాహం రద్దయింది. పెళ్లి తర్వాత సినిమాల్లో పాడటం మానేయాలని, స్కూల్‌లో సంగీత పాఠాలు చెప్పాలని సంతోష్ సూచించడం వల్లనే ఆమె పెళ్లి రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఆమె తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ప్రశంసలు వెళ్లువెత్తాయి.


Click it and Unblock the Notifications











