చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలపై వైరముత్తు స్పందన!
ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత వైరమత్తు మీద టాప్ సింగర్ చిన్మయి శ్రీపాద సెక్సువల్ హరాస్మెంట్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉధృతం అయిన #మీటూ మూమెంటులో పాల్గొన్న చిన్మయి గతంలో తనను వైరముత్తు లైంగికంగా వేధించారని ఆరోపించారు.
వైరముత్తు వల్ల తనకు ఎదురైన వేధింపుల సంఘటన గురించి చిన్మయి వివరిస్తూ... ఓ షో జరుగుతుండగా వైరముత్తు తాను ఉంటున్న హోటల్ రూముకు వచ్చి కలవాలని చెప్పారని, నేను మా అమ్మను తీసుకుని వెళ్లాను. ఆ సమయంలో నన్ను కాంప్రమైజ్ కావాలని అడిగాడు. అందుకు నిరాకరించడంతో షో నిర్వాహకులు నీ కెరీర్ సాగదని బెదిరించారని ఆరోపించారు.

ఈ ఆరోపణలపై రచయిత వైరముత్తు ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన ట్వీట్లో తనను తాను ఇన్నోసెంట్‌గా చెప్పుకున్న వైరముత్తు తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తమిళంలో ట్వీట్ చేశారు.
'ఈ రోజుల్లో ప్రముఖులను, ఏ తప్పూ చేయని వారిపై ఆరోపణలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అందులో ఇదీ ఒకటి. అది నిజం కానపుడు నేను స్పందించాల్సిన అవసరం, వివరణ ఇవ్వాల్సిన పని లేదు. కాలమే నిజం అందరికీ తెలిసేలా చేస్తుంది' పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











