'లీడర్' హీరోయిన్ సైడ్ బిజినెస్ లో బిజీ
రాణా సరసన లీడర్ చిత్రంలో చేసిన ప్రియా ఆనంద్ గుర్తుండే ఉంటుంది. ఆమెకు ఆ సినిమా తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, 180 సినిమాలు వచ్చాయి. కానీ ఆ రెండు కూడా ఆడకపోవటంతో ఆమె తమిళ సినిమాలపై కాన్సర్టేట్ చేసింది. అక్కడ కూడా ఆమె చేసిన సినిమాలు డిజాస్టర్ అయ్యింది. కన్నడ వైపుకి వెళ్దామంటే అక్కడ ఆమెను ఆహ్వానించే వాళ్ళే కరవయ్యారు. దాంతో ఆమె ఏం చేయాలో పాలుపోని స్దితిలో సైడ్ బిజినెస్ కి దిగింది.
సైడ్ బిజినెస్ అంటే సినిమా భాషలో ఓపినింగ్ పంక్షన్ లకు హాజరవ్వటం. అయ్యితే అక్కడా ఆమెకు స్టార్ హీరోయిన్స్ నుంచి పోటీ ఎదురవుతోంది. దాంతో ఆమె స్టాటజీ మార్చి చిన్న చిన్న సంస్ధలు కు భారీ డబ్బు వసూలు చేసి హాజరవటం మొదలెట్టింది. తాజాగా ఆమె వైలెంటైన్స్ డే రోజున చెన్నైలో డ్రీమ్ డేట్ విత్ ప్రియాకు హాజరైంది. సత్యమ్ ధియోటర్స్ లో ఈ ఫంక్షన్ జరిగింది. అక్కడ ఆమె తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది. అయితే ఈ పంక్షన్ కి ఆమె తీసుకుంది చాలా తక్కువ మొత్తమని చెప్తున్నారు. రెండు రోజులకు ఒక్క పంక్షన్ కైనా వెళ్తోంది. ఆమె డైరీ మొత్తం సినిమాలకు డేట్స్ తో కాక ఈ ఈవెంట్ తో నిండిపోతోంది.


Click it and Unblock the Notifications











