Don't Miss!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Valimai: మితిమీరిన అభిమానం.. థియేటర్ ముందే దోపిడికి పాల్పడ్డ ఫ్యాన్స్.. చివరికి నవ్వులపాలు!
తమిళ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వలీమై సినిమా మొత్తానికి నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయ్యింది. గత ఏడాది నుంచి ఎంతగానో ఊరిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్న సమయంలో వాయిదా వేసుకోక తప్పలేదు. ఇక గురువారం రోజు విడుదలైన ఈ సినిమాతో అభిమానుల్లో ఒక పవర్ఫుల్ జోష్ ను చూపించింది. అయితే మితిమీరిన అభిమానం కొన్నిసార్లు హీరోలకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తాయి. ఇటీవల అజిత్ ఫ్యాన్స్ రోడ్డు మీద రెచ్చిపోయి దోపిడీకి పాల్పడ్డారు. ఇక చివరికి వారే నవ్వులపాలయ్యారు.
పాజిటివ్ వైబ్రేషన్స్ తో..
అజిత్ నటించిన వాలీమై సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్ గా పాజిటివ్ వైబ్రేషన్స్ తో విడుదలైంది. ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఎగబడ్డారు. తప్పకుండా సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.
చాలా వేగంగా..
తమిళ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోవర్స్ కలిగిన వారిలో అజిత్ ఒకరు. కూల్ గా ఉండే అజిత్ కు మాస్ ఫ్యాన్ ఫాలోవర్స్ అయితే గట్టిగానే ఉన్నారు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఈజీగా 100కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంటాయి. ఇక వలీమై సినిమా కూడా ఆ రికార్డును చాలా వేగంగా అందుకుంటుందని టాక్ అయితే వస్తుంది.
ఫ్యాన్స్ బీభ3త్సం
ఇక తమిళనాడులో వలీమై సినిమాను అజిత్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఏ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. పలు చోట్ల ఫ్యాన్స్ చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. గురువారం తెల్లవారుజామున ఫ్యాన్స్ షోలతో వలీమై సందడి మొదలైంది.
|
దోపిడీకి పాల్పడ్డ ఫ్యాన్స్
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. వలీమై సినిమాకు సంబంధించిన ఫ్యాన్ షోలలో అపశ్రుతి చోటుచేసుకుంది. కొందరు అభిమానుల థియేటర్ ముందు ఏకంగా దోపిడీకి పాల్పడ్డారు అని కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే అజిత్ కటౌట్స్ కు పాలాభిషేకం చేయాలని రోడ్డు మీద వెళ్తున్న పాల వ్యాన్ పై ఎగబడి ప్యాకేట్లు దొంగతనం చేశారు.
Recommended Video
చివరికి నవ్వులపాలయ్యారు
అభిమానుల తాకిడికి థియేటర్ ముందు ట్రాఫిక్ జామ్ కావడంతో ఉదయాన్నే వెళ్లాల్సిన పాల వ్యాన్స్ కూడా అక్కడ ఆగిపోయాయి. అయితే ఒక వ్యాన్ లోకి ఎక్కిన ఫ్యాన్స్ పైన ఉన్నవి పాల ప్యాకేట్ లు అనికొని తీసుకున్నారు. కానీ తీరా చూస్తే అవి పెరుగు ప్యాకేట్లని తెలిసింది. అజిత్ బ్యానర్ లకు పాలాభిషేకం చేయాలని దోపిడీ చేసిన ఫ్యాన్స్ చివరికి నవ్వులపాలయ్యారు అనే విధంగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక వలీమై సినిమాను బోని కపూర్ నిర్మించగా వినోథ్ దర్శకత్వం వహించారు. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.