Valimai on Zee5.. ఓటీటీలో దుమ్మురేపుతున్న అజిత్ మూవీ.. 7 రోజుల్లో రికార్డు వ్యూస్

తమిళ సూపర్‌స్టార్ అజిత్, టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయ గుమ్మకొండ కాంబినేషన్‌లో వచ్చిన వలిమై చిత్రం థియేటర్లలో అభిమానులకు నిరాశను నింపినా.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌పై దుమ్మురేపుతున్నది. ఎవరూ ఊహించిన విధంగా రికార్డు వ్యూస్ సాధిస్తూ అజిత్ చిత్రం దూసుకెళ్తున్నది. మార్చి 25న డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో రిలీజైన ఈ చిత్రం లక్షలాది మంది ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకొంటున్నది. వలిమై చిత్రం సాధించిన వ్యూస్ వివరాల్లోకి వెళితే..

బైక్ స్టంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో

బైక్ స్టంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో


వలిమై చిత్రంలో అజిత్ ధైర్య సాహాసాలు ప్రదర్శించి బైక్ స్టంట్స్ ప్రదర్శించారు. వెండితెర మీద యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా మారాయి. ప్యాన్ ఇండియా చిత్రంగా రిలీజైన వలిమై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఫైట్స్, కార్తీకేయ పెర్ఫార్మెన్స్ మాత్రం మంచి పేరు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద తొలి వారాంతంలో రికార్డు కలెక్షన్లు సాధించినా ఆ తర్వాత నిలబెట్టుకోలేకపోయింది.

పబ్లిక్ డిమాండ్ మేరకు మలయాళంలో

పబ్లిక్ డిమాండ్ మేరకు మలయాళంలో


వలిమై చిత్రం థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత మార్చి 25వ తేదీన జీ5 యాప్ ద్వారా ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. పబ్లిక్ డిమాండ్‌తో మలయాళ భాషలో కూడా ఈ సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అయితే ఈ సినిమాలో డిలీటెడ్ సీన్లు కూడా చేర్చడం ప్రేక్షకులకు అదనపు ఆకర్షణగా మారింది.

లీజ్‌కు ముందు 10 వేల అడుగుల పోస్టర్

లీజ్‌కు ముందు 10 వేల అడుగుల పోస్టర్

రి
వలిమై సినిమా జీ5లో రిలీజ్‌కు ముందు భారీగా ప్రమోషన్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన 10 వేల అడుగుల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అజిత్ అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఇలాంటి ప్రత్యేకతల మధ్య వలిమై చిత్రం జీ5లో రిలీజైంది.

7 రోజుల్లోనే 500 మిలియన్లు

7 రోజుల్లోనే 500 మిలియన్లు


జీ5 ఓటీటీ యాప్‌లో రిలీజైన తొలి రెండు మూడు రోజుల్లోనే 100 మిలియన్లను సొంతం చేసుకొన్నది. ఓటీటీలో అత్యంత వేగంగా స్ట్రీమింగ్ వ్యూస్ సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. అయితే తాజాగా ఈ చిత్రం కేవలం 7 రోజుల్లోనే 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించడం విశేషంగా మారింది.

Recommended Video

Prabhas Plans To Save UV Creations.. బ్లాక్ బస్టర్ కాంబో సెట్ ! | Filmibeat Telugu
 జీ5 యాప్‌లో వివిధ భాషల్లో సినిమాలు

జీ5 యాప్‌లో వివిధ భాషల్లో సినిమాలు


ZEE5 అనేది వివిధ రకాల వినోద ఫార్మాట్‌లను అందించే ఏకైక వేదిక. వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు ఎల్లప్పుడూ అద్భుతమైన చలనచిత్రాలను చందాదారులకు మరియు చలనచిత్ర ప్రియులకు ప్రతి నెలా తాజా కంటెంట్‌ను అందిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X