చిత్రంపై వీరప్పన్ భార్య వాదన కొట్టేసిన హై కోర్టు
ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలమైంది. ఈ చిత్రం విడుదలపై గం ధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వ్యతిరేకత వ్యక్తం చేశారు. అలాగే చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కోర్టు వనయుద్ధం చిత్రంపై తాత్కాలిక స్టేను విధించింది. ఈ తీర్పు ను వ్యతిరేకిస్తూ చిత్ర దర్శక నిర్మాత హైకోర్టులో అప్పీల్ చేశారు. ఇందులో ఆయన తరపు న్యాయవాది ఎ.నటరాజన్ హాజరై వీరప్పన్ గురించి ప్రచారమైన వార్తలను ఇతివృత్తంగా తీసుకుని వనయుద్ధం చిత్రాన్ని తెరకెక్కించామని పేర్కొన్నారు.
తన కుటుంబానికి వనయుద్ధం వల్ల కళంకం ఏర్పడుతుందనే ముత్తులక్ష్మి వాదన సరైంది కాదన్నారు. ఈ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి రామనాథన్ కింది కోర్టులో విధించిన నిషేధాన్ని తొలగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి అభ్యంతరం తెలిపిన సన్నివేశాలను వనయుద్ధం చిత్రం నుంచి తొలగించడానికి దర్శక నిర్మాత సమ్మతించారని తెలిపారు. దీంతో చిత్రంపై నిషేధం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. వనయుద్ధం చిత్రా న్ని ఈ నెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఏఎంఆర్ రమేష్ తెలిపారు.


Click it and Unblock the Notifications












