Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
అత్తారింటికి దారేది రీమేక్.. శింబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, రమ్యకృష్ణ లుక్ లీక్!
తమిళ స్టైలిష్ హీరో శింబు ప్రస్తుతం తెలుగు సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయింది. వంద రాజవదాన్ వారువేన్ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి కొన్ని సమస్యలు ఎదురై విడుదల వాయిదా పడే పరిస్థితి ఎదురైంది. కానీ శింబు ఆ సమస్యలని పరిష్కరించాడు. తాజాగా ఈ చిత్ర యూనిట్ శింబు అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేసింది.
ఏమీ పీకలేరు, ఆవేశపడకండి.. ఫ్యాన్స్‌కు శింబు మెసేజ్.. చిక్కుల్లో అత్తారింటికి దారేది!
త్వరలో ట్రైలర్
త్వరలో ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ట్రైలర్ కోసం శింబు అప్పుడే డబ్బింగ్ కూడా ప్రారంభించేశాడు. శిబూ డబ్బింగ్ చెబుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ చిత్రంలో శింబు మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. శింబు సరసన మేఘా ఆకాష్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
సుందర్ దర్శత్వంలో
అత్తారింటికి దారేది చిత్ర రీమేక్ హక్కులని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. సుందర్ సి ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగులో ఈ చిత్రం కఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. అదే తరహాలో తమిళంలో కూడా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ లొకేషన్ లోని శింబు స్టిల్ వైరల్ గా మారుతున్నాయి.
లీక్ అయిన రమ్యకృష్ణ లుక్
అత్తారింటికి దారేది చిత్రానికి ప్రధాన బలం అత్త పాత్ర. తెలుగులో పవన్ కళ్యాణ్ కు అత్తగా సీనియర్ నటి నదియా నటించారు. తమిళంలో శింబుకు అత్తగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. రమ్యకృష్ణ లుక్ లీకై వైరల్ అవుతోంది. క్లైమాక్స్ లో రైల్వే స్టేషన్ సీన్ కి సంబంధించి చిత్రీకరణ జరుగుతుండగా రమ్య కృష్ణ లుక్ లీకైంది. తెలుగు క్లైమాక్స్ సన్నివేశం పవన్, నదియా నటన, త్రివిక్రమ్ డైలాగ్స్ తో అద్భుతంగా పండింది.
మరో విజయంపై కన్ను
ఇటీవలే శింబు మణిరత్నం తెరకెక్కించిన నవాబ్ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అత్తారింటికి దారేది రీమేక్ తో మరో హిట్ పై కన్నేశాడు. నవాబ్ చిత్రంలో శింబు నటనకు ప్రశంసలు దక్కాయి. అత్తారింటికి దారేది రీమేక్ తరువాత శింబు పలు చిత్రాలని లైన్ లో పెడుతున్నాడు.