twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vani Jairam's మరణానికి కారణం అదే.. సీసీటీవీ ఫుటేజ్‌లో ట్విస్టు..పోలీసుల చేతికిపోస్టుమార్టం రిపోర్టు!

    |

    ప్రఖ్యాత గాయని వాణి జయరాం మృతితో భారతీయ సినిమా పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. అయితే ఆమె ప్రమాద వశాత్తు మరణించారనే విషయం మరింత విషాదంలోకి నెట్టింది. చెన్నైలోని నివాసంలోని తన బెడ్‌రూంలో తలకు గాయమై మరణించడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు.. అయితే ఈ కేసు వివరాల్లోకి వెళితే..

    పనిమనిషి అందించిన సమాచారంతో

    పనిమనిషి అందించిన సమాచారంతో

    2018లో భర్త జయరాం మరణించిన తర్వాత వాణి జయరాం ఒంటరిగానే ఇంట్లో ఉంటున్నారు. అయితే ప్రతీ రోజు పనిమనిషి వచ్చి ఇంట్లో పనులు చేసి వెళ్తుంటారు. అయితే రోజువారీ పనిలో భాగంగా పనిమనిషి వచ్చి తలుపు కొట్టగా ఎలాంటి ఉలుకు.. పలుకు లేకపోవడంతో అనుమానంతో వాణి జయరాం సోదరి ఉమకు సమాచారం అందించారు. అయితే సోదరి ఉమ వచ్చి డూప్లికేట్ తాళంతో తలుపులు తెరిచి చూడగా తలకు గాయమై అచేతనంగా పడి ఉండటం కనిపించింది.

     అనుమానస్పద మృతిగా కేసు

    అనుమానస్పద మృతిగా కేసు

    వాణి జయరాం మరణం అనుమానాస్పదంగా ఉండటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు వాణి జయరాం ఇంటిని అన్ని కోణాల్లో పరిశోధించారు. ఫొరెన్సిక్ విభాగం నిపుణులు ఇంటిని పూర్తిగా పరిశీలించారు. ఆ తర్వాత పోలీసులు వాణి జయరాం మరణం వ్యవహారాన్ని అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

    కిల్‌పాక్ హాస్పిటల్‌లో పోస్టు మార్టం

    కిల్‌పాక్ హాస్పిటల్‌లో పోస్టు మార్టం

    వాణి జయరాం తలకు గాయం కావడంపై అనేక అనుమానాలు తలెత్తడంతో ఆమె పార్తీవ దేహాన్ని చెన్నైలోని కిల్‌పాక్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె కేసును దర్యాప్తు అన్ని కోణాల్లో విచారించడం మొదలుపెట్టారు. పనిమనిషి, సోదరి ఉమా వాగ్మూలాన్ని పోలీసులు సేకరించారు. పోస్టు మార్టమ్ నివేదికల అధారంగా కేసు విచారణను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.

    2 ఫీట్ల టేబుల్‌పై పండటంతో

    2 ఫీట్ల టేబుల్‌పై పండటంతో

    చెన్నై పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం.. వాణి జయరాం తన గదిలోని 2 ఫీట్ల టేబుల్‌పై పడిపోయారు. దాని కారణంగానే ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమె తలకు గాయం కావడంతో టేబుల్‌పై రక్తపు మరకలు ఉన్నాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో సరైన సమయంలో ట్రీట్‌మెంట్ లభించలేదు. ఆమె మరణం కేవలం ప్రమాద వశాత్తూ వల్లే జరిగింది. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత ఆ ఇంట్లోకి ఎవరు రాలేదనే విషయం స్పష్టమైంది అని వెల్లడించారు.

    సీఎం స్టాలిన్ శ్రద్దాంజలి.. అంత్యక్రియలు పూర్తి

    సీఎం స్టాలిన్ శ్రద్దాంజలి.. అంత్యక్రియలు పూర్తి

    భారతీయ సినీ, సంగీత ప్రియులను విషాదంలోకి నెట్టి తిరిగి రాని లోకాలకు వెళ్లిన వాణి జయరాంకు సినీ ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు. వాణి జయరాం నివాసానికి వెళ్లి తమిళనాడు సీఎం స్టాలిన్ శ్రద్దాంజలి ఘటించి.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు విషాద వదనంతో ఆదివారం మధ్యాహ్నం వాణి జయరాం అంత్యక్రియలు పూర్తి చేశారు.

    English summary
    Padma Bhushan, Singer Vani Jairam Death sent tragic moment. She found dead with forehead injury. So Tamil Nadu Police registered a case under suspicious death. CCTV Footage reveals about legender singer is accidental death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X