twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదంలో విజయ్ కుమార్.. ఇంట్లో నుంచి గెంటేసిన రెండో భార్య కుమార్తె, ఏం జరిగిందంటే!

    |

    ప్రస్తుతం కాలంలో ఆస్తులు, డబ్బు వ్యవహారాల వలన రక్త సంబంధాల మధ్యే వివాదాలు చెలరేగుతున్నాయి. సినీ తారలు ఇందుకు మినహాయింపు కాదు. ఆస్తి వివాదాలు ఎంతవరకైనా వెళతాయనడానికి ఇది ఒక ఉదాహరణ. తాజాగా తండ్రీ కూతుళ్ళ మధ్యే చిచ్చు రేగింది. కన్న కుమార్తె తండ్రిని ఇంటి నుంచి గెంటేసిన ఘటన తమిళ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంది. వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన విజయ్ కుమార్ కుటుంబంలోనే ఈ కలహాలు చోటు చేసుకున్నాయి. విజయ్ కుమార్ ఇప్పటికి నటుడిగా బిజీగా కొనసాగుతున్నారు.

    వందలాది చిత్రాలు

    వందలాది చిత్రాలు

    విజయ్ కుమార్ 1973 నుంచి నటుడిగా కొనసాగుతున్నారు. దక్షణాది భాషలన్నింటిలోనూ అయన వందలాది చిత్రాల్లో నటించారు. తండ్రి పాత్రలు, రాజకీయ నాయకుడి పాత్రల్లో విజయ్ కుమార్ ఎక్కువగా మెరిశారు. ఇటీవల కాలంలో సూర్య సింగం సిరీస్ లో హోమ్ మినిష్టర్ పాత్రలో, జనతా గ్యారేజ్ చిత్రంలో సీఎం పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈయన కుటుంబంలోనే కలహాలు మొదలయ్యాయి.

    రెండో భార్య కుమార్తె

    రెండో భార్య కుమార్తె


    విజయ్ కుమార్ రెండో భార్య ప్రముఖ నటి మంజుల అనే సంగతి తెలిసిందే. మంజుల 2013లో మరణించారు. వీరిద్దరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. వీరి కుటుంబం మొత్తం నటనలో కొనసాగుతుండడం విశేషం. వీరి రెండో కుమార్తె శ్రీదేవి పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు వివాదం మొదలైంది పెద్ద కుమార్తె వనితతో.

    ఇంటి వివాదం

    ఇంటి వివాదం

    విజయ్ కుమార్ కు పెరంబూరులో ఓ భవంతి ఉంది. ఆ భవంతిని విజయ్ కుమార్ షూటింగ్ లకు అద్దెకు ఇస్తుంటారు. పెద్ద కుమార్తె ఓ షూటింగ్ నిమిత్తం ఆ ఇంటిని వచ్చి అక్కడే మకాం పెట్టారు. ఇంటిదని విజయ్ కుమార్ ప్రశ్నిస్తే.. ఈ ఇళ్లు తన తల్లి ఉండంగా సంపాదించినది. నాకు, చెల్లెళ్లకు ఈ ఇల్లు సొంతం అని తండ్రితో వాదించింది. దీనితో విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    సుప్రీం కోర్టులో కేసు

    సుప్రీం కోర్టులో కేసు

    పోలీసులు బలవంతంగా వనితని ఇంటి నుంచి ఖాళీ చేయించారు. అప్పటి నుంచి విజయ్ కుమార్ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ కేసు వివాదంలో వనిత ఇటీవల సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. కోర్టుకు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనితో వనిత ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాల్ని, పోలీసులని వేట బెట్టుకుని తండ్రి నివాసానికి వెళ్ళింది. విజయ్ కుమార్ ని బలవంతంగా బయటకు పంపి ఇంటిని స్వాధీనపరుచుకున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Vanitha Attack on her Father Vijay Kumar's House in Tamil nadu. Here is the details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X