Don't Miss!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
నా తల్లి మరణానికి కారణం అదే.. కనీసం 100 సూసైడ్ చేసుకోవాల్సిందే.. వనితా విజయ్ కుమార్
మూడు పెళ్లి వార్తతో దక్షిణాదిలో సంచలనం రేపిన వనితా విజయ్ కుమార్ తాజాగా తెలుగులో ప్రముఖ మీడియాతో ముచ్చటించారు. తన మూడో పెళ్లి బ్రేకప్, తన తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాలు, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడిస్తూ..

నా తల్లి మాటను ఎదురించా
నా వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వచ్చాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాను. నా పెళ్లి, కాపురం విషయంలో తల్లిదండ్రులను ఎదురించాను. దాంపత్య జీవితంలో నేను రాజీ పడదలుచుకోలేదు. కాబట్టి నా తల్లి మాటను ఎదురించి తొలి మ్యారేజ్ విషయంలో డైవోర్స్ తీసుకొన్నాను అని వనిత విజయ్ కుమార్ తెలిపారు.

100 సార్లైనా సూసైడ్ చేసుకొనే వారేమో
నా జీవితంలో నేను అనుభవించిన కష్టాలు మరొకరికి ఎదురైతే పరిస్థితులు దారుణంగా ఉండేవి. మరొకరికి నా కష్టాలు వస్తే కనీసం 100 సార్లైనా సూసైడ్‌కు ప్రయత్నించే వారేమో. కానీ నేను ధైర్యం అన్ని కష్టాలను దాటుకొంటూ వచ్చాను. ఎలాంటి ఫలితం వచ్చినా అది నాకు సమ్మతమే అని వనితా విజయ్ కుమార్ అన్నారు.

నా తల్లి మరణానికి కారణం
నా తల్లి మంజుల పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. నా పర్సనల్ లైఫ్‌లో కష్టాలు చూసి బాధపడ్డారు. కానీ నా వల్ల మరణించారనేది కరెక్ట్ కాదు. కొన్ని కారణాల వల్ల ఆమె ఆరోగ్యం చెడిపోయింది. అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. అలా మా నుంచి దూరమయ్యారు అని వనిత విజయ్ కుమార్ చెప్పారు.

తండ్రిగా కంటే మంచి భర్త
నటుడు విజయ్ కుమార్ మాకు తండ్రిగా కంటే మా అమ్మకు మంచి భర్త. వారిద్దరూ అద్భుతమైన దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేశారు. నాకు నాన్నతో వ్యక్తిగత విభేదాలు ఉన్నప్పటికీ వారిపై కొంత కోపం, గౌరవం ఉన్నాయి. కానీ అమ్మ చనిపోయేంత వరకు నాన్న చాలా బాగా ఉన్నారు అని వనితా విజయ్ కుమార్ చెప్పారు.

11 రోజుల్లోనే ప్రేమ, పెళ్లి
మా నాన్న విజయ్ కుమార్, అమ్మ మంజులది ప్రేమ వివాహం. అప్పట్లో అమ్మ స్టార్ హీరోయిన్, నాన్న అప్పుడప్పడే ఎదుగుతున్న నటుడు. వారిద్దరు కలిసి ఓ సినిమాలో నటించారు. అది రిలీజ్ కాలేదు. కేవలం 11 రోజుల షూటింగు అనంతరం వారిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకొన్నారు అని వనితా విజయ్ కుమార్ తెలిపారు.