నీ భర్త తాగుబోతు, ఇద్దరు పిల్లల్ని దూరంగా పెట్టు.. సీనియర్ నటి సలహాపై వనితా ఫైర్

యాక్టర్ వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ పెళ్లిపై వివాదాల పర్వం కొనసాగుతున్నది. పీటర్ పాల్ భార్య కేసు నమోదు చేయడంతో ఈ పెళ్లి వివాదంలో కూరుకుపోయి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అలాగే పీటర్ కుమారుడు తన తండ్రిపై ఆరోపణలు చేయడం కూడా ఈ వివాహ వివాదానికి మరింత రంగు పులిమింది. తాజా సీనియర్ నటి లక్ష్మీ రామకృష్ణన్ కామెంట్లపై కూడా మీడియాలో చర్చ జరుగుతున్న క్రమంలో సీనియర్ నటి కుట్టి పద్మిని సూచించిన సలహాపై వనితా మండిపడటంతో మరింత నిప్పును రాజేసింది. ప్రస్తుతం వనిత, కుట్టి పద్మిన మధ్య వివాదం సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది. ఇంతకు వారి మధ్య తాజా వివాదానికి కారణం ఏమిటంటే..

పీటర్ పాల్‌తో వనితా మూడో పెళ్లి

పీటర్ పాల్‌తో వనితా మూడో పెళ్లి

వనితా విజయ్ కుమార్ తన మూడో భర్తగా పీటర్ పాల్‌ను జూన్ 27 తేదీన జరిగిన వేడుకలో స్వీకరించారు. క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగిన పెళ్లికి వనితా విజయ్ కుమార్ ఇద్దరు కూతుళ్లు కూడా హాజరయ్యారు. అయితే పీటర్ పాల్ వ్యక్తిగత జీవితం, అతని మద్యం అలవాట్లు, మహిళలతో అక్రమ సంబంధాలపై అనేక విమర్శలు, ఆరోపణలు రావడంతో పలువురు సినీ ప్రముఖులు వనితా విజయ్ కుమార్‌ను కొన్ని విషయాల్లో హెచ్చరిస్తున్నారు.

నీ భర్త తాగుబోతు.. పిల్లల్ని దూరంగా పెట్టు

నీ భర్త తాగుబోతు.. పిల్లల్ని దూరంగా పెట్టు

తాజాగా సీనియర్ నటి కుట్టి పద్మిని ట్విట్టర్‌లో స్పందిస్తూ వనితా విజయ్ కుమార్‌కు సలహాలు, సూచనలు ఇచ్చారు. పీటర్ పాల్ వ్యక్తిగత అలవాట్లపై విమర్శలు వస్తున్నందున ఇద్దరు అమ్మాయిలను హాస్టల్‌లో చేర్పించండి. తాగుడు అలవాటు ఉన్న వ్యక్తితో కలిసి ఉండటం పిల్లలకు చాలా కష్టం అవుతుంది అని వనితా విజయ్ కుమార్‌కు కుట్టి పద్మిని సలహాలు ఇచ్చారు.

నీ మాదిరిగా పిల్లల్ని వదిలేయను

నీ మాదిరిగా పిల్లల్ని వదిలేయను

సీనియర్ నటి కుట్టి పద్మిని ఇచ్చిన సలహాలపై వనితా విజయ్ కుమార్ మండిపడ్డారు. మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నీ మాటలకు చాలా హర్ట్ అయ్యాను. నీవు ఇంటర్వ్యూలో బహిరంగంగా వెల్లడించడానికంటే వ్యక్తిగతంగా చెప్పాల్సి ఉండేది. అప్పుడు మీ మాటలకు గౌరవం ఇచ్చి ఉండేదానిని. కానీ ఏదో ఉద్దేశంతో మీరు టెలివిజన్‌లో మీ అభిప్రాయం చెప్పడం సరికాదు. మీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు. నీలాగా నా బిడ్డలను ఎక్కడో వదిలేయడం నా వల్ల కాదు అంటూ వనితా విజయ్ కుమార్ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు.

సారీ వనితా.. నా ఉద్దేశం అదికాదు

సారీ వనితా.. నా ఉద్దేశం అదికాదు

వనిత విజయ్ కుమార్ ట్విట్‌కు కుట్టి పద్మిని స్పందిస్తూ.. సారీ వనితా.. నా ఉద్దేశం అది కాదు. ఒకవేళ నా సలహాతో నీ మనసు గాయపడి ఉంటే అందుకు క్షమాపణలు చెబుతున్నాను. నీవు నన్ను, నా మాటలను సరిగా అర్ధం చేసుకోలేదు అని కుట్టి పద్మిని ట్వీట్ చేశారు. అయితే పద్మిని క్షమాపణపై స్పందిస్తూ ఆమె మానసిక పరిపక్వతకు అది అద్దం పట్టిందనేలా కామెంట్ వదిలారు.

Recommended Video

Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
నా పిల్లలే నాకు ప్రపంచం

నా పిల్లలే నాకు ప్రపంచం


కుట్టి పద్మిని క్షమాపణపై వనితా విజయ్ కుమార్ స్పందిస్తూ.. మీరు క్షమాపణలు చెప్పినందుకు థాంక్యూ చెబుతున్నాను. నా పిల్లలు నాకు ప్రపంచం. నా జీవితం. అలాంటి వారిని హాస్టల్‌లో వదిలి రమ్మని చెప్పుతారని కనీసం ఊహించలేదు. మీరు మీ ఛానెల్‌లో సినీ ప్రముఖుల చేత ఇలాంటి గాసిప్స్ చెప్పించకండి. దానికి బదులు మంచి కంటెంట్‌ను ప్రసారం చేయండి అంటూ వనితా విజయ్ కుమార్ మరో ట్వీట్‌లో మండిపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X