భోరున ఏడ్చిన వనిత.. ఆమె చీకటి జీవితాన్ని బయటపెడుతానని వార్నింగ్.. పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా
సినీ నటి వనితా విజయ్ కుమార్ చెన్నైలోని పోరూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎమోషనల్ అయ్యారు. తనపై ఓ యూట్యూబ్ ఛానెల్‌లో తన ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా వీడియోలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసిస్టెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం తన లాయర్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం చేస్తున్నారనే భోరున విలపించారు. పెళ్లి తర్వాత తొలిసారి చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ...

టీఆర్పీ, పబ్లిసిటీ కోసం
యూట్యూబర్ సూర్యదేవి అనే మహిళ తన వ్యక్తిగత జీవితంపై అనవసరంగా అవాస్తవ కథనాలు ప్రసారం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం, టీఆర్పీ రేటింగ్ కోసం నా లైఫ్‌పై వీడియోలను చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. నా పెళ్లి సమయంలో నా గురించి అప్‌లోడ్ చేసిన వీడియోతో 24 గంటల్లో 3 లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. దాంతో నాపై వీడియోలు చేస్తే టీఆర్పీ బాగా వస్తుందనే ఉద్దేశంతో నా వివాహంపై లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారు అని వనితా విజయ్ కుమార్ అన్నారు.

సింగిల్ పేరెంట్ అని పట్టించుకోకుండా
నేను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను. సింగిల్ పేరెంట్ అనే విషయాన్ని గుర్తించకుండా నాపై, నా పిల్లలపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఒక సెలబ్రిటీననే విషయాన్ని పట్టించుకోకుండా నా జీవితంపై దారుణంగా వ్యవహరిస్తున్నారు. సొసైటీలో నాలాంటి సెలబ్రిటీలకు ఇలాంటి పరిస్థితి ఉంటే.. సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి అంటూ మీడియా ముందు భోరున విలపించారు.

వారికి అక్రమ దందాలతో సంబంధం
నాపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్న సూర్యాదేవికి అక్రమ దందాలు ఉన్నాయి. గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. వారి అండతోనే నాపై దుష్రచారం చేస్తున్నారు. వారి నుంచి నాకు భయం ఉంది. అంతేకాకుండా తమిళ కమెడియన్‌తో ఆమెకు అక్రమ సంబంధం ఉంది. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాలకు నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి. వాటిని బహిర్గతం చేస్తాం అని వనితా విజయ్ కుమార్ తెలిపారు.

అసిస్టెంట్ కమిషనర్‌కు దృష్టికి చీకటి కోణాలు
నా పరువు ప్రతిష్ట ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న సూర్యాదేవి, నిర్మాత రవిందర్‌పై పోరూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. అసిస్టెంట్ కమిషనర్‌కి వారి అక్రమ దందాలను వివరించాం. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఎవరిపైనా ఫిర్యాదులు స్వీకరించవద్దని, ఎవరినీ అరెస్ట్ చేయవద్దనే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మేము నడుచుకొంటున్నాం. కరోనా పరిస్థితుల తర్వాత ఫిర్యాదులపై దృష్టిపెడుతున్నాం అని వనితా విజయ్ కుమార్ పేర్కొన్నారు.
Recommended Video

రవిందర్ మనిషేనా?
వనితా విజయ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనపై, తన పిల్లలు, కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నిర్మాత రవిందర్‌పై మండిపడ్డారు. ఆయన ఓ మనిషేనా? ఆయనకు కనీసం వ్యక్తిత్వం ఉందా? అలాంటి వ్యక్తిని నిర్మాతల మండలి నుంచి తన్ని తరిమేయాలి. మహిళలపై నీచంగా మాట్లాడే అలాంటి నిర్మాతను మండలి నుంచి బహిష్కరించాలి అని వనితా విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్య మధ్యలో కన్నీటీ పర్యంతమయ్యారు.


Click it and Unblock the Notifications











