‘ఎక్కడ పనిచేస్తే అక్కడ మహిళలతో అక్రమ సంబంధాలు.. మద్యం, వ్యసనాలకు బానిస’

ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె, సినీ నటి వనితా విజయ్ కుమార్ పెళ్లి వ్యవహారం దక్షిణాది చిత్ర పరిశ్రమలో వివాదంగా మారింది. వీఎఫ్ఎక్స్ నిపుణుడు పీటర్ పాల్‌ను వనితా విజయ్ కుమార్ వివాహం చేసుకోవడం తమిళ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అయితే పీటర్ పాల్ మొదటి భార్య కేసు పెట్టడం, వనితా విజయ్ కుమార్ తీరుపై మండిపడటంతో ఈ పెళ్లి మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. అయితే తాజాగా తమిళ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్ కుటుంబ సభ్యులు వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. పీటర్ కొడుకు వెల్లడించిన విషయాలు ఏమిటంటే..

మద్యం మాన్పించేందుకు అక్కడికి పంపాం

మద్యం మాన్పించేందుకు అక్కడికి పంపాం

పీటర్ పాల్ కుమారుడు మీడియాతో మాట్లాడుతూ.. మా నాన్న పచ్చి తాగుబోతు. ఐదేళ్ల క్రితం మద్యం మాన్పించడానికి ఆయనను రిహాబిలేషన్ సెంటర్లలో చేర్పించాం. ఆ సెంటర్ నుంచి పారిపోయేందుకు గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పట్లో ఆయన వేధింపులు భరించలేక నేను, సోదరి, తల్లి అంతా కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్లాం అని అన్నారు.

ఐదేళ్ల క్రితం మరో మహిళతో సంబంధం, గర్బం చేసి..

ఐదేళ్ల క్రితం మరో మహిళతో సంబంధం, గర్బం చేసి..

సుమారు ఐదేళ్ల క్రితం నా తల్లికి అన్యాయం చేసి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొన్నారు. అప్పటికే ఆ మహిళ గర్భవతి. అప్పటి నుంచి మా తల్లి మా నాన్నతో మాట్లాడటం మానేశారు. ఆ సమయంలో నా చెల్లెలికి రెండేళ్ల వయసు. ఆ సమయంలో నా తండ్రి గురించి ఆలోచిస్తే చాలా దారుణంగా అనిపించేది. ఫుల్లుగా తాగి వచ్చేవాడు. నా తల్లికి బదులు వేరే మహిళను తల్లిగా భావించాలని ఒత్తిడి చేశారు. ఇప్పుడు కూడా మరో మహిళను తెచ్చే అదే మాదిరిగా చేస్తున్నాడు అని పీటర్ కుమారుడు వెల్లడించారు.

ఎక్కడ పనిచేస్తే అక్కడి మహిళలతో

ఎక్కడ పనిచేస్తే అక్కడి మహిళలతో

మా నాన్న ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం మాకు కొత్తేమి కాదు. ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ ఓ మహిళతో సంబంధాలు పెట్టుకొంటారు. తాను తప్పు చేసిన ప్రతీసారి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తాగుడుకు బానిసవుతాడు. ఆయనంటే మాకు చిన్నప్పటి నుంచే ఓ రకమైన అసహ్యం అని పీటర్ కుమారుడు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. వనితా విజయ్ కుమార్ పెట్టిన యూట్యూబ్ ఛానెల్‌కు పనిచేస్తున్న సమయంలోనే పీటర్ ఆమెతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే.

వనితతో పెళ్లికి ముందు మా నాన్నతో

వనితతో పెళ్లికి ముందు మా నాన్నతో

పెళ్లికి ముందు వనితా ఇంటికి మా నాన్నతో కలిసి ఓ సాయంత్రం వెళ్లాను. ఆ ఇంట్లోనే డిన్నర్ చేశాను. వనిత కూతురును నా సోదరిగా భావిస్తున్నాను. కొద్దిరోజులుగా మెసేజెస్, మీమ్స్ షేర్ చేసుకొంటున్నాం. అయితే వనితను మా నాన్న పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. కానీ ఎప్పటి మాదిరిగానే తన నిర్ణయాన్ని తాను తీసుకొన్నారు అని పీటర్ కొడుకు మీడియాకు వెల్లడించారు.

డబ్బు కోసం మా అమ్మ వివాదం చేయలేదు

డబ్బు కోసం మా అమ్మ వివాదం చేయలేదు

డబ్బు కోసం తన తల్లి వివాదాన్ని సృష్టించిందని వనితా ఆరోపణలు చేయడం చాలా తప్పు. విడిపోయిన ఏడేళ్ల నుంచి ఎన్నడూ నా తల్లి డబ్బులు గురించి గొడవ పడలేదు. ఇంకా మా నాన్ననే ఆమె నగల కోసం, మా అమ్మమ్మకు సంబంధించిన ఐదు లక్షల రూపాయల కోసం తీవ్రంగా గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి అని పీటర్ కొడుకు అన్నారు. వనితా విజయ్ కుమార్ తన తల్లికి తీరని అన్యాయం చేసినందని అన్నారు.

Recommended Video

Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
నీతి, నిజాయితీ లేని మనిషి

నీతి, నిజాయితీ లేని మనిషి


సినిమా పరిశ్రమలో ఆయన ప్రతిభ, ఆయన పనితీరు నాకు బాగా నచ్చుతాయి. కానీ కుటుంబ పరంగా ఆయన ఓ చెత్త మనిషి. నీతి నిజాయితీ లేని వ్యక్తి, చాలా వ్యసనాలు ఉన్న మనిషి. వనితను పెళ్లి చేసుకొంటున్నారనే వార్త వినిపించినప్పుడు ఈ మనిషి ఇక జన్మలో మారడు. గతంలో మాదిరిగానే మరో మహిళతో సంబంధం పెట్టుకొంటున్నాడు అని పీటర్ పాల్ కొడుకు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X