For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మగవాళ్లే కాదు.. ఆడవాళ్లు నాతో దారుణంగా.. ముగ్గురు పిల్లల తల్లినని చూడకుండా.. వనితా విజయ్ కుమార్ ఫైర్

  |

  బిగ్‌బాస్ ఫేం, తమిళ సినీ నటి వనితా విజయ్ కుమార్ గత కొద్దికాలంగా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తున్నారు. పీటర్ పాల్‌తో మూడో వివాహం బ్రేకప్ అయిన తర్వాత ఆమె కెరీర్‌పై పూర్తిగా దృష్టిపెట్టారు. అయితే విజయ్ టెలివిజన్‌లో ఆమె బీబీ జోడిగల్ షోలో సురేష్ చక్రవర్తితో కలిసి పాల్గొంటున్నారు. అయితే షో నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆమె ఆ షోకు గుడ్‌బై చెబుతూ సుదీర్ఘమైన లేఖను సంధించారు. ఆ లేఖలో ఆమె ఎలా స్పందించారంటే..

  బీబీ జోడిగల్ నుంచి తప్పుకొంటూ

  బీబీ జోడిగల్ నుంచి తప్పుకొంటూ

  బీబీ జోడిగల్ రియాలిటీ షోలో నేను వేసిన కాళికా అవతారానికి ప్రశంసలు అందించిన అభిమానులు, శ్రేయోభిలాషులు, నాకు సపోర్టుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి, మీడియాకు ధన్యవాదాలు. అయితే బీబీ జోడిగల్‌ నుంచి తప్పుకొంటున్న నేపథ్యంలో మీ నుంచి స్పందన చూసి ఈ లేఖ రాయాలని అనిపించింది. నన్ను ఎవరైనా కూడా దూషించినా , వేధించినా, వెన్నుపోటు పొడిచినా నేను సహించను. అలాంటి వారు నా కుటుంబంలో ఉన్నా ఉపేక్షించను అని వనితా విజయ్ కుమార్ అన్నారు.

  అనైతికంగా ప్రవర్తించడంతో

  అనైతికంగా ప్రవర్తించడంతో

  నాకు విజయ్ టీవీతో అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. బిగ్‌బాస్ తర్వాత మరింత పెరిగింది. కుకూ విత్ కోమలి, కలక్క పోవదు యారు లాంటి షోలతో పనిచేస్తున్నాను. కొన్ని షోలలో స్పెషల్ అప్పీయరెన్స్ కూడా ఇచ్చాను. విజయ్ టీవీ నిర్వాహకులతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ కొందరు వర్క్ ప్లేస్‌లో అనైతికంగా, ప్రొఫెషనలిజానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం చాలా బాధకలిగించింది అని వనితా విజయ్ కుమార్ తెలిపారు.

  నా అవకాశాలపై దెబ్బ కొడుతూ

  నా అవకాశాలపై దెబ్బ కొడుతూ

  కొందరు ఇగోతో నాతో దారుణంగా ప్రవర్తించారు. మగవాళ్లే కాకుండా ఆడవాళ్లు నా ప్రొఫెషనల్ గ్రోత్‌ను చూసి తట్టుకోలేకపోయారు. నా అవకాశాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించడం చాలా బాధపెట్టింది. కానీ నేను ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాను. లాక్ డౌన్ ముగిసింది కాబట్టి నా సినిమాలు, కొత్తగా టీవీ షోలను చూసే సమయం ఆసన్నమైంది.

  భర్త సపోర్ట్ లేకుండా

  భర్త సపోర్ట్ లేకుండా

  విజయ్ టెలివిజన్‌లో కొందరు సినియర్లు జూనియర్లను నీచంగా చూస్తున్నారు. దారుణంగా అవమానించడమే కాకుండా వారిని కెరీర్ పరంగా తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. భర్త సపోర్ట్ లేకుండా ఆపై ముగ్గురు పిల్లల తల్లిని అయి ఉండి కూడా కెరీర్ పరంగా ఎదుగుతుంటే జెలసీగా ఫీలవుతున్నారు. తోటి మహిళకు తొటి మహిళ సహాయం పడాలనే ఇంగితం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీబీ జోడిగల్‌కు గుడ్‌బై చెప్పడం విషాదంగా ఉంది అని వనితా విజయ్ కుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

  సురేష్ చక్రవర్తి‌పై సానుభూతి

  ఏది ఏమైనా ఇలాంటి ప్రతికూలతలను అధిగమించాలి. ఈ సవాళ్లను ఎదురించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అలాగే తనకు జోడిగా వ్యవహరించిన సురేష్ చక్రవర్తి‌పై సానుభూతిని వ్యక్తం చేశారు. నాకు సరైన నిర్ణయాన్ని నేను తీసుకొన్నాను. నా వల్ల నీవు ఈ షో నుంచి బయటకు రావడం నాకు బాధగా ఉంది. నేను తీసుకొన్న నిర్ణయానికి నికార్సైన ప్రొఫెషనల్‌గా అండగా నిలిచినందుకు థ్యాంక్స్ అని వనితా విజయ్ కుమార్ తెలిపారు.

  English summary
  Vanitha Vijay Kumar quits BB jodigal Show and She wrote that.. Thank you vijaytelevision for giving me the best opportunities of my life beginning from #biggbosstamil3 ..#cookuwithkomali season 1..and #kalakkapovadhuyaaru season 9.. and #bbjodigal. I want to make it clear I WALKED OUT OF THE SHOW bbsureshthatha sorry I had to do this.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X