వనిత మూడో పెళ్లి వివాదం కొత్త మలుపు.. ఆమెపై కేసు.. సైబర్ మాఫియా గుట్టు విప్పుతా అంటూ..

తమిళ చిత్రపరిశ్రమలో వనితా విజయ్ కుమార్ పెళ్లి వివాదంలో కొత్త ట్విస్టు చోటుచేసుకొన్నది. తాను మూడో పెళ్లి చేసుకోవడంపై పలువురు చేస్తున్న కామెంట్లకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది. తనను టార్గెట్ చేస్తున్న వారి నిజ స్వరూపాలు బయటపెడుతానని అర్ధరాత్రి ట్వీట్లు చేయడంతో తమిళ సినీరంగంలో హల్‌చల్ మొదలైంది. మంగళవారం సంచలన రీతిలో పోలీస్ స్టేషన్‌లోనే ప్రెస్‌మీట్ పెడుతానని ట్వీట్ చేయడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి మొదలైంది. వివరాల్లోకి వెళితే..

 పెళ్లి తర్వాత వనితా విజయ్ కుమార్‌పై

పెళ్లి తర్వాత వనితా విజయ్ కుమార్‌పై

సినీ ప్రముఖుడు పీటర్ పాల్‌ను మూడో పెళ్లి చేసుకొన్న తర్వాత వనితా విజయ్ కుమార్‌ టార్గెట్ చేసుకొని పలువురు విమర్శలు గుప్పించారు. పీటర్ పాల్ వ్యక్తిగత జీవితం గురించి, వనిత పర్సనల్ లైఫ్ గురించి కామెంట్లు చేయడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి వనితా విజయ్ కుమార్ ఘాటుగా జవాబిస్తున్న విషయం తెలిసిందే.

సూర్యాదేవి వర్సెస్ వనితా విజయ్ కుమార్

సూర్యాదేవి వర్సెస్ వనితా విజయ్ కుమార్

ఇక తాజాగా సూర్యాదేవి అనే యూట్యూబర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ వనితా విజయ్ కుమార్ పెళ్లి అంశం వివాదంగా మారింది. ఇటీవల వనితా విజయ్ కుమార్‌పై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ దూషణలకు పాల్పడం, ఆమెకు వ్యతిరేకంగా వీడియోలు య్యూటూబ్‌లో పోస్టు చేయడం జరుగుతున్నది. దాంతో వనితా విజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.

 తమిళసై పై అనుచిత వ్యాఖ్యలతో

తమిళసై పై అనుచిత వ్యాఖ్యలతో

అయితే గతంలో సూర్యదేవికి, వనితా విజయ్ కుమార్‌కు ఏదో గొడవ భారీగానే జరిగిందనే విషయం సోషల్ మీడియా పోస్టుతో బయటకు వచ్చింది. తమిళనాడు బీజేపీ నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత తెలంగాణ గవర్నర్ తమిళసైని సూర్యాదేవీ దూషిస్తూ చేసిన వీడియో పెడితే.. ఆమెను అరెస్ట్ చేసిన వార్తను వనితా విజయ్ కుమార్ చేయడం వారిద్దరి మధ్య గొడవకు కారణమని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే సూర్యాదేవి మళ్లీ దూషణ పర్వం మొదలుపెట్టిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

చీప్ పబ్లిసిటీ కోసమే అంటూ వనితా ఫైర్

చీప్ పబ్లిసిటీ కోసమే అంటూ వనితా ఫైర్

ఇక తనపై విమర్శలు చేస్తున్న సూర్యాదేవిపై వనిత డైరెక్ట్‌గా ఎటాక్ చేసింది. ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేసుకొని చీప్ పబ్లిసిటీ కోసం కొందరు పాకులాడుతున్నారు. మా హోదాను, మా పేరును అప్రతిష్టపాలు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తున్నాను. చెన్నైలోని పోరూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అక్కడే కొందరి నిజస్వరూపాలు బయటపెట్టేందుకు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాను అని వనితా విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.

Recommended Video

Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
సైబర్ మీడియా గుట్టు బయటపెడుతా

సైబర్ మీడియా గుట్టు బయటపెడుతా

తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్న వారిపై అసిస్టెంట్ కమిషనర్‌ను కలుస్తున్నానని వనితా విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు అసిస్టెంట్ కమిషనర్‌ను కలుస్తున్నాను. సూర్యాదేవిపై చేసిన ఫిర్యాదుపై ఆయనతో చర్చిస్తాను. ఆమె చేసిన అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలను అందజేస్తాను. సైబర్ మాఫియా గుట్టు బయటపెడుతా అంటూ వనితా విజయ్ కుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X