twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోల్డ్‌మ్యాన్‌తో వనితా విజయ్‌కుమార్.. ఈ సారైనా అదృష్టం వరించేనా?

    |

    వివాదాలతోపాటు నిత్యం వార్తల్లో మునిగి తేలుతూ ఉండే వనితా విజయ్ కుమార్ మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించింది. లాక్‌డౌన్‌లో మూడో పెళ్లితో మీడియాను పరుగులు పెట్టించడమే కాకుండా పలు వివాదాలకు వేదికగా నిలించింది. అయితే ఇక వివాదాలకు తెర దించుతూ కెరీర్‌పై దృష్టిపెట్టి తాజాగా ఓ క్రేజీ సినిమాలో నటించడానికి సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

    మూడో పెళ్లి ద్వారా

    మూడో పెళ్లి ద్వారా

    వనితా విజయ్ కుమార్ తన మూడో పెళ్లి ద్వారా ఇటీవల దక్షిణాదిలో సంచలనం రేపింది. పెళ్లైన నెల రోజులకే మూడో భర్త పీటర్ పాల్‌తో తెగతెంపులు చేసుకొని మరో వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఆ తర్వాత నుంచి వివాదాలకు దూరంగా ఉంటూ కనిపిస్తున్నారు.

    విజయ్‌తో కలిసి చంద్రలేఖ మూవీలో

    విజయ్‌తో కలిసి చంద్రలేఖ మూవీలో

    అయితే గతంలో చాలా ఏళ్ల క్రితం ఇళయ దళపతి విజయ్‌తో కలిసి చంద్రలేఖ అనే చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసి రాణించలేకపోవడంతో టెలివిజన్ ఇండస్ట్రీని నమ్ముకొన్నారు.

    బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా

    బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా

    టెలివిజన్ నటిగా రాణిస్తున్న సమయంలోనే కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించే తమిళ బిగ్‌బాస్ సీజన్ 1 షోలో కంటెస్టెంట్‌గా చేరి మరోసారి తన పాపులారిటీ పెంచుకొన్నారు. ఇలా నిత్య వార్తల్లో ఉండే వనితా విజయ్ కుమార్ మరోసారి నటిగా అదృష్టం పరీక్షించుకొనున్నారు.

    గోల్డ్‌మ్యాన్‌తో కలిసి సినిమాలో

    గోల్డ్‌మ్యాన్‌తో కలిసి సినిమాలో

    తమిళనాడులో ఒంటి నిండా బంగారం ధరించి గోల్డ్ మ్యాన్‌గా పిలువబడే హరి నాడార్‌తో కలిసి 2K అజగనథు కాదల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. హరినాడార్ పనన్‌గట్టు పాడై అనే రాజకీయ పార్టీలో కూడా సభ్యుడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శనివారం చెన్నైలో జరిగాయని వనితా విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.

    English summary
    Actress and Bigg Boss Tamil fame Vanitha Vijay Kumar is set pair with Gold Man Hari Nadar for 2K Azhaganathu Kaadhal. Her come back entry into Kollywood after long gap. She tweeted that 2K Azhaganathu Kaadhal pooja and filming starts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X