Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గోల్డ్‌మ్యాన్‌తో వనితా విజయ్‌కుమార్.. ఈ సారైనా అదృష్టం వరించేనా?
వివాదాలతోపాటు నిత్యం వార్తల్లో మునిగి తేలుతూ ఉండే వనితా విజయ్ కుమార్ మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించింది. లాక్డౌన్లో మూడో పెళ్లితో మీడియాను పరుగులు పెట్టించడమే కాకుండా పలు వివాదాలకు వేదికగా నిలించింది. అయితే ఇక వివాదాలకు తెర దించుతూ కెరీర్‌పై దృష్టిపెట్టి తాజాగా ఓ క్రేజీ సినిమాలో నటించడానికి సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళితే..
మూడో పెళ్లి ద్వారా
వనితా విజయ్ కుమార్ తన మూడో పెళ్లి ద్వారా ఇటీవల దక్షిణాదిలో సంచలనం రేపింది. పెళ్లైన నెల రోజులకే మూడో భర్త పీటర్ పాల్‌తో తెగతెంపులు చేసుకొని మరో వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఆ తర్వాత నుంచి వివాదాలకు దూరంగా ఉంటూ కనిపిస్తున్నారు.
విజయ్‌తో కలిసి చంద్రలేఖ మూవీలో
అయితే గతంలో చాలా ఏళ్ల క్రితం ఇళయ దళపతి విజయ్‌తో కలిసి చంద్రలేఖ అనే చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసి రాణించలేకపోవడంతో టెలివిజన్ ఇండస్ట్రీని నమ్ముకొన్నారు.
బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా
టెలివిజన్ నటిగా రాణిస్తున్న సమయంలోనే కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించే తమిళ బిగ్‌బాస్ సీజన్ 1 షోలో కంటెస్టెంట్‌గా చేరి మరోసారి తన పాపులారిటీ పెంచుకొన్నారు. ఇలా నిత్య వార్తల్లో ఉండే వనితా విజయ్ కుమార్ మరోసారి నటిగా అదృష్టం పరీక్షించుకొనున్నారు.
గోల్డ్‌మ్యాన్‌తో కలిసి సినిమాలో
తమిళనాడులో ఒంటి నిండా బంగారం ధరించి గోల్డ్ మ్యాన్‌గా పిలువబడే హరి నాడార్‌తో కలిసి 2K అజగనథు కాదల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. హరినాడార్ పనన్గట్టు పాడై అనే రాజకీయ పార్టీలో కూడా సభ్యుడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శనివారం చెన్నైలో జరిగాయని వనితా విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.