వనితా విజయ్ కుమార్ మళ్లీ పెళ్లి? ట్విట్టర్‌లో షాకింగ్ పోస్ట్.. వైరల్‌గా తమిళ్ పవర్‌స్టార్‌తో మ్యారేజ్ ఫోటో!

వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం బిగ్‌బాస్ ఫేమ్, తమిళ నటి వనితా విజయ్ కుమార్‌కు కొత్తేమీ కాదు. ఇటీవల మూడో పెళ్లి చేసుకొని తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. తాజాగా బిబీ జోడిగల్ అనే షో నుంచి వాకౌట్ చేయడం మరో వివాదంగా మారింది. అలాంటి వివాదాలు సద్దుమణగకముందే సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోను ట్వీట్ చేసింది. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే...

పీటర్ పాల్‌తో మూడో పెళ్లి

పీటర్ పాల్‌తో మూడో పెళ్లి

కరోనావైరస్‌తో ప్రపంచం తలకిందులైన పరిస్థితుల్లో నటి వనితా విజయ్ కుమార్ సినీ ప్రముఖుడు పీటర్ పాల్‌ను పెళ్లి చేసుకొని సంచలనం రేపింది. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే పలువురు తమిళ సినీ ప్రముఖులు ఆమె నిర్ణయాన్ని తప్పు పట్టడంతో ఆ వివాహం వివాదంగా మారింది. లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఆ వివాదం పోలీసు స్టేషన్ మెట్లెక్కింది.

మూడో భర్తను భరించలేనంటూ

మూడో భర్తను భరించలేనంటూ

అయితే పెళ్లి జరిగిన కొన్ని నాళ్లకే పీటర్ పాల్‌కు గుడ్‌బై చెబుతూ వనితా విజయ్ కుమార్ తీసుకొన్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. పీటర్ ఆరోగ్యం క్షీణించడం, చావుబతుకుల్లో ఉన్న ఆయనను కాపాడి మొదటి భార్యకు అప్పగించింది. మద్యానికి బానిసైన ఆయనను భరించలేనంటూ స్పష్టం చేసింది. దాంతో ఆ పెళ్లి అలా అర్ధాంతరంగా సుఖాంతం అయింది.

వివాదాలకు దూరంగా.. కెరీర్‌పై దృష్టి

వివాదాలకు దూరంగా.. కెరీర్‌పై దృష్టి

అప్పటి నుంచి వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్న వనితా విజయ్ కుమార్ పూర్తి స్థాయిలో కెరీర్‌పైనే దృష్టి పెట్టారు. అంధాధూన్ తమిళ రీమేక్‌తోపాటు పలు సినిమాల్లో ఆఫర్లు అందుకొన్నారు. టెలివిజన్‌పై బీబీ జోడిగల్ షోలో పాల్గొన్నారు. ఇటీవలే రమ్యకృష్ణ వేధిస్తున్నారంటూ ఆ షోకు గుడ్‌బై చెప్పడం చర్చనీయాంశమైంది.

తమిళ పవర్ స్టార్‌తో పెళ్లి

తమిళ పవర్ స్టార్‌తో పెళ్లి

ఇలాంటి వివాదాల మధ్య వనితా విజయ్ కుమార్ తాజాగా తమిళనాడు పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో పెళ్లి జరిగినట్టు ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అయితే పవర్ స్టార్ ఇక్కడ అనే విధంగా నర్మగర్భంగా ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టింది. దాంతో గత కొద్దికాలంగా మళ్లీ పెళ్లి చేసుకొంటారా అనే విధంగా అనుమానాలకు తావిచ్చింది.

వనిత విజయ్ కుమార్ ట్విస్టుపై

వనిత విజయ్ కుమార్ ట్విస్టుపై

తాజాగా తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో దండలు మార్చుకొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోపై అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏంటీ వనితా విజయ్ కుమార్ ఇలా ట్విస్టు ఇచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకు వనితా విజయ్ కుమార్ నిజంగానే పెళ్లి చేసుకొన్నారా అనేది ధృవీకరించుకోలేకపోతున్నారు.

Recommended Video

Vanitha Vijayakumar, Peter Paul Marriage BREAK UP మూడో మొగుడ్ని కూడా తరిమేసిన వనితా విజయ్‌కుమార్
సినిమా ప్రమోషన్ కోసమే అంటూ అనుమానాలు

సినిమా ప్రమోషన్ కోసమే అంటూ అనుమానాలు

అయితే సినీ వర్గాల కథనం ప్రకారం.. ఓ టెలివిజన్ లేదా సినిమాకు సంబంధించిన షూట్‌కు సీన్ అయి ఉంటుంది. అభిమానుల్లో జోష్‌ను పెంచడానికి ఈ పని చేసి ఉంటుంది. త్వరలోనే ఆమె అసలు విషయం బయటపెట్టడం ఖాయం అంటూ పెళ్లి వార్తలను కొట్టిపడేస్తున్నారు. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితులకు త్వరలోనే వనితా విజయ్ కుమార్ క్లారిటీ ఇస్తారమో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X