వనిత మూడో పెళ్లి దారుణం.. సారీ ఎందుకు చెప్పాలి.. దేనికైనా రెడీ.. నిర్మాత వ్యాఖ్యల దుమారం

తమిళ నటి వనితా విజయ్ కుమార్, సినీ సాంకేతిక నిపుణుడు పీటర్ పాల్ పెళ్లి రాద్దాంతం కోలీవుడ్‌లో ఎడతెగని డైలీ సీరియల్‌లా కొనసాగుతూనే ఉంది. తమ పెళ్లిపై ఎవరైనా కామెంట్ చేస్తే ధీటుగా సమాధానం చెబుతూ కొత్త వివాదానికి తెర తీస్తున్నారు. చట్ట విరుద్దంగా పెళ్లి చేసుకోవడం సరికాదు అంటూ తమిళ నిర్మాత చేసిన వ్యాఖ్యలపై వనితా విజయ్ కుమార్ మండిపడ్డారు. తన పెళ్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎవరీ హక్కులేదు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత తీరు సరికాదు అంటూ అపరకాళి అవతారం ఎత్తారు. ఇంతకు నిర్మాత చేసిన కామెంట్లు ఏమిటంటే..

పీటర్ పాల్‌పై భార్య, కొడుకుల తీవ్ర ఆరోపణలు

పీటర్ పాల్‌పై భార్య, కొడుకుల తీవ్ర ఆరోపణలు


తమిళ చిత్ర పరిశ్రమలో వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ పెళ్లి అత్యంత దుమారం లేపుతున్నది. పెళ్లి వార్తలు మీడియాలో కనిపించగానే పీటర్ పాల్ భార్య ఎలిజబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత కొడుకుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తన భర్త వ్యసన పరుడు, తాగుబోతు అంటూ బహిరంగ విమర్శలు చేశారు.

టెలివిజన్ హోస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు

టెలివిజన్ హోస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఆ తర్వాత టీవీ హోస్ట్, నటి లక్ష్మీ రామకృష్ణన్ తన ఛానెల్‌లో మాట్లాడుతూ.. విడాకులు తీసుకోకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్దం అనే విషయం వనితా విజయకుమార్‌కు తెలియదా? అంటూ ప్రశ్నించారు. లక్ష్మీ రామకృష్ణన్ చేసిన వ్యాఖ్యలపై వనితా విజయ్ కుమార్ మండిపడుతూ విడిపోయి వేరేగా జీవించడం, లేదా విడాకులకు నీకు తేడా తెలియదా? ఇలాంటి రూమర్లు ప్రచారం చేయకుండా మంచి కంటెంట్‌తో టీవీ షో నడుపుకో అంటూ ఘాటుగా స్పందించారు.

సీనియర్ నటి కుట్టి పద్మిని సలహాతో వివాదం

సీనియర్ నటి కుట్టి పద్మిని సలహాతో వివాదం

ఇక వనితా విజయ్ కుమార్ పెళ్లి నేపథ్యంలో మరో సీనియర్ నటి కుట్టి పద్మిని స్పందిస్తూ.. ఆమె భర్త పీటర్ పాల్ తాగుబోతు, స్త్రీ లోలుడు అంటూ అందరూ అంటున్నారు. అయితే ఆయనకు ఇద్దరు అమ్మాయిలను దూరంగా పెట్టాలి లేదా వారిద్దరి హాస్టల్‌లోనైనా ఉంచాలి అంట కామెంట్ చేశారు. కుట్టి పద్మిని వ్యాఖ్యలపై మండిపడుతూ.. అందరూ నీలాగా కూతుళ్లను వదిలేసి బతకడం కుదరదు అంటూ ఘాటుగా స్పందించారు.

నిర్మాత రవిందర్ వ్యాఖ్యలతో పెను దుమారం

నిర్మాత రవిందర్ వ్యాఖ్యలతో పెను దుమారం

ఇక తాజాగా నిర్మాత రవిందర్ కూడా వనితా విజయ్ కుమార్ పెళ్లిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పీటర్ పాల్‌ను పెళ్లి చేసుకోని మొదటి భార్య, వారి పిల్లలకు అన్యాయం చేశారు అంటూ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. అయితే నా పెళ్లి విషయంలో మీ జోక్యం అవసరం లేదు. వెంటనే నాకు క్షమాపణలు చెప్పాలి అంటూ రవిందర్‌కు వాట్సాప్‌లో ఆడియో సందేశాన్ని పెట్టారు. దానిని సోషల్ మీడియాలో విడుదల చేశారు.

Recommended Video

Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
సారీ చెప్పను.. దేనికైనా సిద్దమే

సారీ చెప్పను.. దేనికైనా సిద్దమే


అయితే వనితా డిమాండ్‌ను నిర్మాత రవిందర్ తోసిపుచ్చారు. ఆమెకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఎలాంటి లీగల్ కేసునైనా ఎదుర్కొంటాను. నేను చేసిన వ్యాఖ్యల్లో తప్పలేదు అని రవిందర్ క్లారిటీ ఇచ్చారు. బిగ్‌బాస్ రోజుల నుంచి వనిత అంటే నాకు గౌరవం, ఆమెకు నేను బిగ్ ఫ్యాన్‌ను. ఆమె పెళ్లి విషయంలో నేను చేసిన వ్యాఖ్యలు వాస్తవమే. వాటిని తప్పు పట్టడానికి వీలు లేదు అని నిర్మాత రవిందర్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X