twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ బాధ అనుభవించే వారికే తెలుస్తుంది.. వనితా విజయ్‌కుమార్ ఆవేదన

    |

    వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లిపై ఎంతటి వివాదం చెలరేగుతుందో అందరికీ తెలిసిందే. పీటర్ పాల్ తన భార్య ఎలిజబెత్ హెలెన్‌కు విడాకులు ఇవ్వకుండా వనితను పెళ్లి చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. పీటర్‌పై ఎలిజబెత్ ఫిర్యాదు చేయడం, వనితపై సోషల్ మీడియాలో నెగెటివిటీ పెరగడం జరిగింది. అంతే కాకుండా నిర్మాత రవీంద్రన్, కస్తూరీ శంకర్, సూర్యాదేవీ, నంజిల్ విజయన్ వంటి వారు వనితను సోషల్ మీడియాలో విపరీతంగా టార్గెట్ చేయడం, ట్రోల్ చేయడం అందరికీ తెలిసిందే.

    మలుపులు తిరుగుతూ..

    మలుపులు తిరుగుతూ..

    రవీంద్రన్, కస్తూరీ శంకర్, సూర్యాదేవీ, నంజిల్ విజయన్ వంటి వారు సోషల్ మీడియాలో, టీవీ డిబెట్లలో, యూట్యూబ్‌లో వనితను తిట్టడంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే సూర్యాదేవీని అరెస్ట్ చేయడం, కస్తూరీ బెయిల్ మీద విడిపించడం అందరికీ తెలిసిందే.

    ఫోటోలతో రచ్చ..

    ఫోటోలతో రచ్చ..

    ఇక ఈ వివాదంలోనే ప్రైవేట్ ఫోటోలను లీక్ చేయడం అందరినీ షాక్‌కు గురి చేసింది. వనిత తన స్నేహితుడితో సన్నిహితంగా ఉన్న ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నంజిల్ విజయన్, సూర్యాదేవీ సన్నిహితంగా ఉన్న ఫోటోను వనిత లీక్ చేయడం అందరికీ తెలిసిందే.

    సైబర్ దాడి..

    సైబర్ దాడి..

    సోషల్ మీడియాలో తన మీద జరుగుతున్న దాడి, నెగెటివిటీపై వనిత స్పందిస్తూ.. ‘సోషల్ మీడియాను ఎలా తప్పుగా వాడొచ్చో? ఎంత నెగెటివిటీ ఉందో అందరికీ అర్థమై ఉంటుందా? ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అంటే ఇంకొకరి లైఫ్‌లోకి తొంగి చూడటం కాదు. వ్యక్తిగత జీవితంపై దాడి చేయడం కాదు. యూట్యూబ్ మీడియా ఇలాంటి చెత్తనంతా పెంచి పోషిస్తున్నాయి.

    అనుభవించిన వారికే తెలుస్తుంది..

    అనుభవించిన వారికే తెలుస్తుంది..

    ఇదంతా ఆపాలంటే సైబర్ చట్టాలను ఇంకా పటిష్టం చేయాలి. త్వరగా యాక్షన్ తీసుకునేలా చట్టాలను మార్చాలి. సోషల్ మీడియాలో దాడి అనేది నేరం. అది వ్యక్తిగతంగా అనుభవించినప్పుడే దాని బాధ అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఒకరి గురించి చెడుగా మాట్లాడటం అనేది చాలా సులభం.

    అప్పుడే ప్రపంచం మారుతుంది..

    అప్పుడే ప్రపంచం మారుతుంది..


    ఇదంతా ఆపితే అప్పుడు ప్రపంచం మొత్తం మారుతుంది. ఓ వ్యక్తి ముందుగా ఇలా చేయకపోతే అవతల వ్యక్తి కోపోద్రేక్తులు కారు. కానీ కొందరు మాత్రం వాటిని ఒప్పుకోరు. వారే మొదలుపెడతారు. కానీ ఒప్పుకోరు. మనం ఎవరి పని వారు చూసుకుంటే.. ఇలాంటివి జరగవ'ని ఆవేదన చెందింది.

    English summary
    Vanitha Vijayakumar About Cyber bullying. Let's all stop doing that then the world will change.when one person does it the affected person does it in return out of anger.but people also forget someone started it. If all of us mind our own business this wouldn't happen
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X