For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ మెగా హీరో నాకు లైన్ వేశాడు.. నా మూడో పెళ్లి బ్రేకప్ వెనుక కారణం అదే.. వనితా విజయ్ కుమార్

  |

  బిగ్‌బాస్ తమిళ కంటెస్టెంట్, హీరోయిన్ వనితా విజయ్ కుమార్ ఇటీవల కాలంలో మీడియాలో సంచలనంగా మారింది. లాక్‌డౌన్ సమయంలో జరిగిన తన మూడో పెళ్లి వివాదంగా మారడంతో పలు వారాలపాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. ఈ క్రమంలో తెలుగులో ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు. వనితా విజయ్ కుమార్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

  చిన్న వయసులోనే మొదటి పెళ్లి

  చిన్న వయసులోనే మొదటి పెళ్లి

  అమ్మాయిలకు చిన్న వయసులోనే తొందరగా పెళ్లి చేయడమనే తప్పు. మా తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేయాలనే ఆతృతలో నాకు 18 ఏళ్లకే పెళ్లి చేశారు. అంతకు ముందు మా ఇంట్లో మరో సిస్టర్‌కు 15 ఏళ్లకే పెళ్లి చేశారు. అది కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు. వాళ్లు డివోర్స్ తీసుకొన్నారు. నా విషయంలో కూడా అదే జరిగింది అని వనితా విజయ్ కుమార్ చెప్పారు.

  నా తల్లిదండ్రులు అర్ధం చేసుకోలేదు

  నా తల్లిదండ్రులు అర్ధం చేసుకోలేదు

  నా మొదటి పెళ్లి విషయంలో చాలా వివాదాలు చోటుచేసుకొన్నాయి. పరువు కోసం నా తల్లిదండ్రులు భయపడ్డారు. నేను విడాకులు తీసుకోవడం వాళ్లు ఒప్పుకోలేదు. విడాకులకు ముందు మేకప్, బ్రేకప్‌లు చాలా జరిగాయి. దాంతో నా మొదటి పెళ్లిని తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకోవడం నా తల్లిదండ్రులకు నచ్చలేదు. ఆ తర్వాత నా ఇద్దరు పిల్లలు, నన్ను ఇంటి నుంచి బయటకు పంపించారు అని వనితా విజయ్ కుమార్ చెప్పారు.

  రెండో పెళ్లి బ్రేకప్ అలా...

  రెండో పెళ్లి బ్రేకప్ అలా...

  నా రెండో పెళ్లి విషయంలో కూడా తప్పు జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే నాకు, ఆయనకు సరిపోదని తెలిసింది. నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. నా తల్లిదండ్రులకు కూడా ఆ విషయం తెలుసు. నా వైవాహిక జీవితంలో సంతోషం లేదు. ఇక లాభం లేదనే నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ బ్రేకప్ చేసుకొన్నాను. అలా నా రెండో వివాహం బ్రేకప్ జరిగింది అని వనితా విజయ్ కుమార్ తెలిపారు.

  ఒంటరితనంతో బాధపడుతూ మూడో పెళ్లి

  ఒంటరితనంతో బాధపడుతూ మూడో పెళ్లి

  జీవితంలో వయసుతో సంబంధం లేకుండా తోడు కోరుకుంటుంది. ఒంటరితనంతో బాధపడుతున్న సమయంలో మూడో పెళ్లి జరిగింది. అతడి గురించి పూర్తిగా తెలియకుండా కొన్ని తప్పులు చేశాను. కానీ కొద్ది సమయంలోనే నేను ఆ బంధం నుంచి బయటకు వచ్చాను. అది లీగల్‌గా జరగకపోవడంతో పెద్దగా సమస్య కాలేదు. మూడో పెళ్లి వల్ల నాకు మంచే జరిగింది.

  పీటర్ చీట్ చేయలేదు..

  పీటర్ చీట్ చేయలేదు..

  పీటర్ పాల్‌ నన్ను చీట్ చేయలేదు. అతడిపై నేను ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఆయన ఆరోగ్యం కోసం నేను 10 లక్షలపైగా ఖర్చు పెట్టాను. అయితే అతడు నా జీవితానికి సరిపోడనే విషయాన్ని తెలుసుకొన్నాను. నా ఇద్దరు అమ్మాయిల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మూడో పెళ్లిని సానుకూల పరిస్థితుల్లో బ్రేకప్ చేసుకొన్నాను అని వనితా విజయ్ కుమార్ తెలిపారు.

  వాళ్లేందుకు కలపడం లేదంటూ

  వాళ్లేందుకు కలపడం లేదంటూ

  మూడో పెళ్లి ద్వారా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నాపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు. మొదటి భార్య నాకు భర్త కావాలని అడిగారు. అంతకు ముందు వాళ్లు నాకు ఏడేళ్లు విడిగా ఉన్నారు. నాతో విడిపోయిన తర్వాత వాళ్లు ఎందుకు కలిసి ఉండటం లేదు. నాపై కామెంట్లు చేసిన కొందరు సెలబ్రిటీలు ఇప్పుడు వాళ్లిద్దరిని ఎందుకు కలపడం లేదని ప్రశ్నించారు.

  అల్లు అర్జున్ నాకు లైన్ వేశాడంటూ

  అల్లు అర్జున్ నాకు లైన్ వేశాడంటూ

  ఇదిలా ఉంటే.. చెన్నైలో తెలుగు పరిశ్రమ ఉన్న సమయంలో మెగాస్టార్ ఫ్యామిలీతో మాకు చాలా అనుబంధం ఉండేది. చిరంజీవి ఇంట్లో జరిగే బర్త్ డేకు మా ఫ్యామిలీ అంతా వెళ్లే వాళ్లం. చిరంజీవి నటించే ఓ సినిమా ఒపెనింగ్‌కు వెళ్లిన సమయంలో అల్లు అర్జున్ నాకు లైన్ వేశాడు. నాకంటే చిన్నవాడైనప్పటికీ.. నన్ను ప్రేమగా చూడటం నేను గమనించాను. అప్పుడు బన్నీ అని తెలియదు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ స్వయంగా గుర్తు చేశాడని వనితా విజయ్ కుమార్ తెలిపారు.

  English summary
  Tamil Actress, Bigg Boss Tamil celebrity Vanitha Vijayakumar about her close relation with Allu Arjun and mega family. She said, Allu Arjun moves closely with me in Chiranjeevi's movie opening function.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X