నాపై రూ. 1.25 కోటి పరుపు నష్టం దావా.. ఆమె అమాయకుల రక్తం తాగుతోందంటూ వనిత ఫైర్

తమిళ నాట కరోనా వైరస్ ఎంతగా విజృంభిస్తుందో.. వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి అంతగా వైరల్ అవుతోంది. పీటర్ పాల్ తన మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్‌కు విడాకులు ఇవ్వకుండా వనితను పెళ్లి చేసుకోవడంతో వివాదం మొదలైంది. తనకు విడాకులు ఇవ్వకుండా, తనని మోసం చేసి పీటర్ వనిత పెళ్లి చేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఈ వివాదంలో ఒక్కొక్కరుగా ఎంటరై వివాదాన్ని తారాస్థాయికి చేర్చారు. నిర్మాత రవీంద్రన్, హీరోయిన్ కస్తూరీ శంకర్, లక్ష్మీ రామకృష్ణన్, సూర్యా దేవీ వంటి వారంత వనితను తప్పుబట్టారు.

మూడో పెళ్లి వివాదంగా..

మూడో పెళ్లి వివాదంగా..

ఇక ఈ మూడో వివాహం నిత్యం డిబెట్లు, వనిత వ్యవహారంపై వాదోపవాదాలు, ఒకరిపై ఒకరు దూషించుకోవడం జరుగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో కొందరు వనితకు మద్దతు తెలుపుతుండగా.. మరి కొందరు పీటర్ భార్య ఎలిజెబెత్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. వీరిద్దరి వ్యవహారంలో దూరిన సూర్యా దేవీని అరెస్ట్ చేయడం సంచలనం రేపింది.

సూర్యాదేవీపై ఫిర్యాదు..

సూర్యాదేవీపై ఫిర్యాదు..

తనపై కామెంట్లతో దాడికి దిగుతున్న సూర్యాదేవీ, రవీంద్రన్, కస్తూరీ శంకర్‌పై పోలీసులకు వనిత ఫిర్యాదు చేసింది. యూట్యూబ్, మీడియాల్లో తమ గురించి చెడుగా మాట్లాడుతున్నారని, విమర్శలతో విసిగిస్తున్నారని అందరి మీదా కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలోనే సూర్యాదేవీని అరెస్ట్ చేయగా.. కస్తూరీ శంకర్ బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చింది.

మరో లక్ష్మీ రామకృష్ణన్..

మరో లక్ష్మీ రామకృష్ణన్..

మరో వైపు లక్ష్మీ రామకృష్ణన్ వనితకు లీగల్ నోటీసులు పంపించడం మరింత వివాదాన్ని రేకెత్తించింది. ఓ యూట్యూబ్ చానెల్‌లో తనపై వనిత నోరు పారేసుకుందని, తన ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిందని, పరువు నష్టం దావా వేస్తున్నట్టు ఓ నోటీస్ పంపింది. దీనికి వనిత తన స్టైల్లో సమాధానం ఇచ్చింది.

Recommended Video

Ala Vaikunthapurramuloo Bollywood Remake,Star Hero Showing Intrest!
రక్తం పీల్చుతోంది..

రక్తం పీల్చుతోంది..

లక్ష్మీ రామకృష్ణన్ తనకు కోటీ ఇరవై లక్షల మేరకు పరువు నష్టం దావా వేసిందని సోషల్ మీడియాలో వనిత ట్వీట్ చేసింది. ‘చూడండి ఈ సామాజిక కార్యకర్త తన లాయర్‌తో బెదిరింపులకు దిగింది.. రూ. 1.25 కోట్లు ఇవ్వాలని పరువు నష్టం దావా వేసింది. ఓ ఫ్యామిలీకి సాయం చేస్తానని, నా వ్యక్తిగత జీవితంలోకి దూరి.. ఆమెకు ఎలాంటి అర్హత లేకపోయినా ఓ న్యాయ నిర్ణేతలా నటించింది. అమాయకపు బాధితుల రక్తం పీల్చుతుంది. నా లాయర్ ఆమెకు నోటీసులు పంపుతున్నాడ'ని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X