twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చీప్ బిహేవియర్‌.. మీ కుళ్లిన బుద్దిని ఎప్పటికీ మార్చుకోరు?.. వనితా విజయ్ కుమార్ ఫైర్

    |

    మూడో పెళ్లి అనూహ్య మలుపులు తిరగడం, మీడియా, సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్ రావడం, పోలీస్ స్టేషన్ వరకు వివాదం వెల్లడంతో వనితా విజయ్ కుమార్ తన పద్దతిని కాస్త మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్య గొడవలకు దిగడం మానేసి.. నీతులు చెబుతోంది. సోషల్ మీడియాలో నెగెటివిటీ, దూషణలు, కామెంట్ల వల్ల కలిగే బాధ.. అనుభవించే వారికే తెలుస్తుందంటూ వనిత తెగ ఎమోషనల్ అవుతోంది. నెగెటివిటీని వదిలేయండని వనిత తాజాగా చేసిన ట్వీట్ అలానే ఉంది. గొడవలకు దూరంగా ఉండాలని వనిత ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

     మూడో పెళ్లి వివాదం..

    మూడో పెళ్లి వివాదం..

    వనిత-పీటర్ పాల్ వివాహం తమిళ నాట పెద్ద చిచ్చునే రేపింది. పీటర్ తన మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్‌కు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకోడంతో వివాదం మొదలైంది. ఎలిజబెత్ తన భర్త పీటర్, వనితపై ఫిర్యాదు చేసింది. ఇక వనితకు మద్దతుగా సూర్యాదేవీ, కస్తూరీ, రవీంద్రన్, నంజిల్ విజయన్ వంటి వారు వచ్చారు. వనితపై వీరంతా కలిసి మాటలతో, కామెంట్లతో ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

    మాటల దాడి..

    మాటల దాడి..

    సూర్యాదేవీ, కస్తూరీ, రవీంద్రన్, నంజిల్ విజయన్, వనిత అందరూ ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేసుకున్నారు. అందరూ కలిసి వనితను టార్గెట్ చేయగా.. ఆమె కూడా అంతే స్థాయిలో విరుచుకుపడింది. ఇక వీరి గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లగా సూర్యాదేవీని అరెస్ట్ చేశారు. వనిత అరెస్ట్ చేయించగా.. బెయిల్ మీద కస్తూరీ విడిపించింది. ఇలా రోజుకో రకంగా ఈ వివాదం ముందుకు పోతూనే ఉంది.

     కఠిన చట్టాలు..

    కఠిన చట్టాలు..

    సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్.. సైబర్ బుల్లింగ్ ఎంత బాధిస్తాయో.. అవి అనుభవించిన వారికే తెలుస్తుందని వనిత వాపోయింది. సైబర్ నేరాలకు కఠిన శిక్ష విధించాలని, వెంటనే అరెస్ట్ చేసేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని వనిత కోరింది. తాజాగా మరో ట్వీట్ చేస్తూ తన ఆవేదన అంతా చెప్పుకొచ్చింది.

    చాలా మంది సూసైడ్..

    చాలా మంది సూసైడ్..

    ఈ మధ్య చాలా మంది సెలెబ్రిటీలు అది సినిమా కావచ్చు టీవీ పరిశ్రమ కావచ్చు.. దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయినా సరే ఇప్పటికీ కూడా టార్గెట్ చేయడం, కార్నర్ చేసి కామెంట్లు చేయడం ఆపడం లేదు. చచ్చిపోవాలి అంటూ సెలెబ్రిటీలపై అక్కసు వెల్లగక్కుతున్నారు. మీరెప్పుడైనా మీది మీరు ఆలోచించుకున్నారా?.. ఈ ప్రపంచంలో మీరు నథింగ్. జాబ్ లేని కోటికొక్కడు మాత్రమే పక్కవారి మీద కామెంట్స్ చేస్తుంటారు.

    నీచ ప్రవర్తనతో..

    నీచ ప్రవర్తనతో..

    దేవుడు అన్నీ గమనిస్తుంటాడు. మీరు ఎంతో పాపం కూడా మూటగట్టుకుంటున్నారు. ఒకరు తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కారణమైతే వారు ఘోరమైన పాపం చేసినట్టే. ఇలాంటి చీప్ బిహేవియర్‌తో స్వర్గానికి వెళ్తారని అనుకుంటున్నారా?.. అసలు సమస్యను మీరెప్పుడూ అర్థం చేసుకోలేరు. మీరెప్పుడూ మీ కుళ్లిన బుద్దిని కూడా మార్చుకోరు. నెగెటివిటీని వదిలేయండి' అని చెప్పుకొచ్చింది.

    English summary
    Vanitha Vijayakumar About negativity On Social Media. So many suicides all over India recently..many from film or tv industry..and yet netizens bully abuse people and corner them ..many comment saying DIE. do u even realize who u are..u are a nothing in this world ..one in a billion jobless enough to comment on someone timeline when
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X