twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్‌కు రానని మొండికేశాడు.. వాళ్ల అమ్మ అలా అనడంతో... దళపతిపై నటి షాకింగ్ కామెంట్స్

    |

    దళపతి విజయ్ క్రేజ్ గురించి సౌత్‌లో అందరికీ తెలిసిందే. సౌత్ సూపర్ స్టార్‌గా వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్నాడు విజయ్. అసమానమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న విజయ్.. తమిళ నాట సినీ రంగాన్ని ఏలేస్తున్నాడు. రజినీకాంత్ తరువాత అంతటి ఫాలోయింగ్‌ను దక్కించుకున్న విజయ్.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడు. ఆయన సినీ కెరీర్‌లో జరిగిన ఓ సంఘటన గురించి తాజాగా ఓ నటి వివరించింది.

    కింది స్థాయి నుంచి..

    కింది స్థాయి నుంచి..

    విజయ్ ఇప్పుడంటే కోలీవుడ్‌ను ఏలేస్తున్నాడు. కానీ సినీ కెరీర్ మొదలుపెట్టినప్పుడు 90 దశకంలో విజయ్ అతి సామాన్య నటుడు. అంచెలంచెలుగా ఎదుగుతూ కోలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసించే స్థాయికి ఎదిగాడు. ఆయనకు ఎదురైన ఓ సంఘటన గురించి వనితా విజయ్ కుమార్ వివరించింది.

    నటుడి కుమార్తె..

    నటుడి కుమార్తె..

    నటుడు విజయ్ కుమార్ కుమార్తె వనిత తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. దేవీ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది. అయితే తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. విజయ్‌తో కలిసి 1995లో ఓ చిత్రం నటించింది వనిత.

    చంద్రలేఖ షూటింగ్..

    చంద్రలేఖ షూటింగ్..

    తాను, విజయ్ కలిసి చంద్రలేఖ సినిమాలో నటించామని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటనను వనిత తాజాగా వెల్లడించింది. ఆ రోజుల్లో క్యాస్టూమ్స్ ఎలా ఉండేవో వివరించింది. పెద్ద హీరోలకు మాత్రం వారు మెచ్చిన క్యాస్టూమ్స్ ఉండేవి, మిగతా వాళ్లకి ప్రొడక్షన్ వాళ్లు ఏది ఇస్తే అదే వేసుకునే వారని తెలిపింది.

    Recommended Video

    Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
    రూమ్‌లోనే ఉండిపోయాడు..

    రూమ్‌లోనే ఉండిపోయాడు..

    అయితే ఓ పాట షూటింగ్ సమయంలో విజయ్‌కి ఇచ్చిన క్యాస్టూమ్స్ నచ్చలేదట. దీంతో రూమ్‌లోకి వెళ్లిపోయి రాలేదని తెలిపింది. విజయ్ వాళ్ల అమ్మ శోభా వచ్చి ఎంతో బతిమిలాందని, బయటకు రా వచ్చి షూటింగ్ పూర్తి చేయమని కోరిందని చెప్పుకొచ్చింది. తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్‌లో వనితా పార్టిసిపేట్ చేయడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది.

    English summary
    Vanitha Vijayakumar About Thalapathy Vijay In Chandralekha Movie Set. Vijay refused to come out of his room for the shooting since he didn't like the costume given to him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X