వనిత విజయ్‌కుమార్‌ మూడో పెళ్లికి షాక్.. భర్త పీటర్‌పై అసలు భార్య కేసు

ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లి వివాదంగా మారింది. తమిళ సినీ రంగంలో వీఎఫెక్స్ ఎడిటర్‌గా సేవలందిస్తున్న పీటర్ పాల్‌ను వనితా విజయ్ కుమార్ కొద్ది రోజుల క్రితం అంటే జూన్ 27వ తేదీన క్రిస్టియన్ మత సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవడం తెలిసిందే. అయితే వనితా విజయ్ కుమార్‌ను పెళ్లి చేసుకొన్న పీటర్ పాల్‌పై భార్య ఎలిజబెత్ హెలెన్ కేసు నమోదు చేశారు. ఈ పెళ్లి చట్ట ప్రకారం చెల్లదు అంటూ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

ఇద్దరు పిల్లలు, విడాకులు తీసుకోలేదు

ఇద్దరు పిల్లలు, విడాకులు తీసుకోలేదు

పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్ మీడియాతో మాట్లాడుతూ.. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి ఇంటర్మిడియెట్, అమ్మాయి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. సంసారంలో కలతలు, కలహాలు సహజం. దాదాపు 15 ఏళ్లకుపైగా దాంపత్య జీవితం మా మధ్య ఉంది. ఏడేళ్లుగా మేము వేర్వేరుగా ఉంటున్నాం. మేము ఇప్పటి వరకు విడాకులు తీసుకోలేదు. అలాంటి సమయంలో వనిత విజయ్ కుమార్ మా కాపురంలో నిప్పులు పోశారు అని అన్నారు.

వనితతో పెళ్లి వార్తలతో అప్రమత్తం

వనితతో పెళ్లి వార్తలతో అప్రమత్తం

యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన వనితా విజయ్ కుమార్‌తో నా భర్త పీటర్‌ పాల్‌కు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో వారిద్దరి దగ్గరయ్యారు. పెళ్లి వార్తలు మీడియాలో, యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం కావడంతో నా దృష్టికి వచ్చింది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పీటర్ నాతో చెప్పడంతో నిజమే అనుకొన్నాను. కానీ వనితాతో పెళ్లికి సిద్దమయ్యారనే విషయంతో జూన్ 19న నేను వడపళని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను అని ఎలిజబెత్ అన్నారు.

విడాకులు తీసుకోకుండా పెళ్లి

విడాకులు తీసుకోకుండా పెళ్లి

చట్ట ప్రకారం విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకోవడం తప్పు. నా భర్తకు నేను విడాకులు ఇవ్వలేదు. ఇక ముందు ఇవ్వను కూడా. ఎందుకంటే నా పిల్లలకు తండ్రి కావాలి. డబ్బు కోసమే.. మరో దాని కోసమో నేను కేసు పెట్టలేదు. నా భర్త నాకు కావాలి. వారిద్దరు పెళ్లి చేసుకోవడానికి అంత అర్జెంట్ ఏమిటి. అంత తొందరగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ పీటర్ భార్య ఎలిజబెత్ హెలెన్ ప్రశ్నించారు.

ఆమెకే ఫీలింగ్స్ ఉంటాయా.. నాకు ఉండవా?

ఆమెకే ఫీలింగ్స్ ఉంటాయా.. నాకు ఉండవా?

పెళ్లి విషయంలో వనితా విజయ్ కుమార్‌కే పట్టింపు ఉందా? మా కాపురం విషయంలో మాకు ఎమోషన్స్ ఉండావా? నా భర్త, పిల్లలు అనే ఫీలింగ్ నాకు ఉండదా? 41 ఏళ్ల వయసు ఉన్న నాకు భర్తపై అధికారం లేదా? అసలు విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ఎలిజబెత్ హెలెన్ ప్రశ్నించారు.

విడాకులు తీసుకోలేదనే విషయం తెలియదా?

విడాకులు తీసుకోలేదనే విషయం తెలియదా?

వనిత విజయ్ కుమార్‌పై ఎలిజబెత్ హెలెన్ నిప్పులు చెరిగారు. తన భర్తకు ఓ కుటుంబం ఉందనే ఆమె తెలియదా? పీటర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయం తెలిసి, అలాగే విడాకులు తీసుకోలేరనే విషయం కూడా తెలిసి పెళ్లి చేసుకొన్నారు. చట్టాలను ఉల్లంఘించి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వనితకు ఏమొచ్చింది అంటూ హెలెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా పిటిషన్ తీసుకోవడానికి..

నా పిటిషన్ తీసుకోవడానికి..

పీటర్ పెళ్లి చేసుకొంటారనే వార్తలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిటిషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నా పిటిషన్ తీసుకోవడానికి నిరాకరించారు. వనిత సినిమా నటి, సెలబ్రిటీ కావడం వల్లే ఆమె పరపతికి తలవొగ్గారు. నాలాంటి సాధారణ ప్రజలు ఫిర్యాదు చేసే అవకాశం లేదా? ఇలా నా లాంటి అన్యాయం జరిగితే ఎవరికి చెప్పకొంటారు అని ఎలిజబెత్ హెలెన్ ఆవేదన వ్యక్తం చేశారు.

వనిత విజయ్ కుమార్‌తో మాట్లాడలేదు..

వనిత విజయ్ కుమార్‌తో మాట్లాడలేదు..

పెళ్లి వార్తల నేపథ్యంలో వనిత విజయ్ కుమార్‌తో మాట్లాడలేదు. ఆమె నలుగురు న్యాయమూర్తులు, అడ్వకెట్లకు ఉండే బలం ఆమెకు ఉంది. నేను ఆమె ఇంటికి వెళ్లి మాట్లాడితే నాపై తప్పుడు కేసు పెట్టి బెదిరిస్తారనే భయంతో నేను పోలీసులను ఆశ్రయించాను. సంఘంలో పలుకుబడి ఉన్న వాళ్లను ఎదిరించే శక్తి నాకు లేదు అని ఎలిజబెత్ హెలన్ అన్నారు.

Recommended Video

Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
 పీటర్ పాల్‌పై కేసు నమోదు

పీటర్ పాల్‌పై కేసు నమోదు


వనితా విజయ్ కుమార్, పీటర్ పెళ్లికి చట్టబద్దత లేదు అంటూ ఎలిజబెత్ హెలెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను చెన్నైలోని వడపళని పోలీసులు స్వీకరించారు. ఎలిజబెత్ ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వారిద్దరి పెళ్లి ఫోటోలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X