వనితా విజయ్ కుమార్‌కు పోలీసుల ఝలక్.. రాజీ దిశగా బిగ్‌బాస్ బ్యూటీ!
తమిళ నటి, బిగ్‌బాస్ బ్యూటీ వనితా విజయ్ కుమార్ పెళ్లి వివాదం అనేక మలుపులు తిరుగుతున్నది. తన మూడో భర్త పీటర్ పాల్‌తో పెళ్లిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం, దానికి నిర్మాత రవిందర్, యూట్యూబర్ సూర్యాదేవి సపోర్ట్ చేయడం వివాదంగా మారింది. అయితే పీటర్ భార్యకు మద్దతుగా రిలీజ్ చేసిన వీడియోలు వివాదం కావడంతో వాటిని రూపొందించిన సూర్యాదేవిపై వనితా కుమార్ పోరూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరింత వివాదాన్ని రాజేశాయి. ఈ క్రమంలో వనితా విజయ్ కుమార్ శుక్రవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా
తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా యూట్యూబ్‌లో వీడియోలు పెడుతున్నారని సూర్యాదేవి అనే మహిళపై వనితా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి సూర్యాదేవిపై పలు ఆరోపణలు చేశారు. గంజాయి అక్రమ వ్యాపారం చేస్తారని, డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి అని లాయర్ శ్రీధరన్‌తో కలిసి ఆరోపణలు చేశారు.

వనితాపై సూర్యాదేవి కేసు
తనపై అసత్య ఆరోపణలు చేశారనే కారణాలను చూపుతూ గురువారం సాయంత్రం వనితా విజయ్ కుమార్‌పై సూర్యాదేవి కేసు నమోదు చేశారు. తనపై దారుణమైన ఆరోపణలు చేశారు. తనకు డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయని, అలాగే ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నాయి అని ఆరోపణలు చేశారు. వీటిపై విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని సూర్యాదేవి వడపళని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వనితా కేసు వడపళని పీఎస్‌కు బదిలీ
గత రెండు రోజుల ఊహించని పరిణామాలు చోటుచేసుకొన్న క్రమంలో వనితా విజయ్ కుమార్ పోరూరులో దాఖలు చేసిన కేసును వడపళని కేసు కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ కేసుల విచారణకు వడపళని పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని వనితకు సమన్లలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వనితా తన లాయర్‌తో కలిసి వడపళని పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు.

వనితా విజయ్ కుమార్ ట్వీట్
తాను కేసు విచారణకు హాజరవుతున్నట్టు వనితా విజయ్ కుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. నిర్మాత రవీంద్రన్, సూర్యాదేవిపై చేసిన ఫిర్యాదు గురించి తెలుసుకోవడానికి వడపళని పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నాను. తన ఫిర్యాదుపై వెంటనే విచారణ జరిపించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఈ కేసు విచారణను అదే పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు అని ట్వీట్ చేశారు.
Recommended Video

పీటర్ పాల్‌తో పెళ్లి, వివాదాలపై వనితాను విచారించిన..
ఇక వడపళని పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలను వనితా విజయ్ కుమార్ నుంచి సేకరించారు. పీటర్ పాల్‌తో పెళ్లి గురించి, ఆ తర్వాత చోటుచేసుకొన్న వివాదాల గురించి ప్రశ్నించి ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఇదిలా ఉండగా సూర్యాదేవి, రవిందర్, వనితా విజయ్ కుమార్ తమ మధ్య వివాదాన్ని ముగించేందుకు పరస్పరం రాజీ కావాలనే నిర్ణయానికి వచ్చారనే వార్తలు ఊపందుకొన్నాయి.


Click it and Unblock the Notifications











