twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వూర్లో వారికి ఇద్దరు భర్తలు, భార్యలు.. ప్రజల ఆగ్రహం, చిక్కుల్లో వనిత విజయ్.. సెలబ్రిటీ అరెస్ట్

    |

    బిగ్‌బాస్ సెలబ్రిటీ, సినీ నటి వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి వ్యవహారం రోజు రోజుకు మరితం వివాదాస్పదం అవుతున్నది. మీడియాలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, మనోభావాలు దెబ్బ తీసే విధంగా కామెంట్లు చేసుకొంటూ వనిత, ఆమె ప్రత్యర్థులు రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా తన ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు చేసిన వ్యాఖ్యలు ఆమెను పీకల్లోతు చిక్కుల్లో పడేశాయి. దాంతో ఆమె క్షమాపణ చెప్పుతూ వివరణ ఇచ్చారు. ఇంతకు ఆమె చేసిన వ్యాఖ్యలు, ఎవరి ఉద్దేశించి చేశారంటే..

    విడాకులివ్వని పీటర్ పాల్‌తో వనితా విజయ్ పెళ్లి

    విడాకులివ్వని పీటర్ పాల్‌తో వనితా విజయ్ పెళ్లి

    పీటర్ పాల్ అనే సినీ ప్రముఖుడిని మూడో పెళ్లి చేసుకోవడంపై కొందరు నటీనటులు, టెలివిజన్ ప్రముఖులు వనితా విజయ్ కుమార్‌ను తప్పుపట్టారు. మొదటి భార్యకు విడాకులివ్వని పీటర్ పాల్‌ను వనితా విజయ్ కుమార్ ఎలా పెళ్లి చేసుకొంటారంటూ సోషల్ మీడియా, యూట్యూబ్, టెలివిజన్ ఆధారంగా నిలదీశారు. ఈ క్రమంలో వనిత ఫిర్యాదు మేరకు యూట్యూబర్ సూర్యాదేవిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె వ్యక్తిగత బెయిల్‌పై రిలీజ్ అయ్యారు.

    తంజావూరు ప్రజలను ఉద్దేశించి వివాదాస్పదంగా

    తంజావూరు ప్రజలను ఉద్దేశించి వివాదాస్పదంగా

    ఇక వనితా విజయ్ కుమార్ తన మూడో పెళ్లిని సమర్ధించుకోవడానికి చేసిన వ్యాఖ్యలు ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టాయి. తంజావూరు ప్రజలకు ఇద్దరు భార్యలు, భర్తలు ఉండటం సర్వసాధారణం. నా తండ్రికి ఇద్దరు భార్యలు ఉన్నారు. నేను కూడా అలా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది అని ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలతో ఒక్కసారి తంజావూరు ప్రజలు భగ్గమన్నారు. తంజావూరు ప్రజల మనోభావాలు దెబ్బ తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    తంజావూరు ప్రజలకు వివరణ

    తంజావూరు ప్రజలకు వివరణ

    దాంతో వనిత తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేశారు. తంజావూర్ నా స్వస్థలం. అక్కడి వారసత్వ సంపద, చరిత్ర, సంస్కృతిని చెప్పడానికి గర్వంగా ఫీలవుతాను. అలాంటి నా ప్రజలు, ఫ్యామిలీ మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడలేను. అక్కడి మగవాళ్లు తమ కుటుంబాలను బాధ్యతతో చూసుకొంటారు. వారు తమ ఫ్యామిలీలకు కట్టుబడి ఉంటారు. నా తల్లిదండ్రులు ఇద్దరు తంజావూర్ వాళ్లే. అయినా వారిద్దరూ ఒక కులం కాకపోయినా ఫ్యామిలీ వ్యవస్థను బలంగా నమ్మారు. ఒకవేళ నా మాటలు మిమ్మల్ని బాధపెట్టినట్టయితే అందుకు క్షమాణలు చెబుతున్నాను అని వనితా విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.

     నా మాటలు బాధపెట్టినట్టయితే క్షమాపణ

    నా మాటలు బాధపెట్టినట్టయితే క్షమాపణ

    తంజావూరుకు చెందిన నా సోదరి సోదరులకు ఒకటే మనవి. నా మాటలను తప్పుగా అర్ధం చేసుకొని ఆగ్రహించవద్దు. నా నుంచి వచ్చిన మాటలు మిమల్ని బాధపట్టినయితే అందుకు క్షమాపణ చెబుతున్నాను. ఆ వ్యాఖ్యలు వెనుకు ఎలాంటి దురుద్దేశం లేదు. నా మాతృభూమి తంజావూరుకు ఎప్పుడూ తలవంచి జీవిస్తాను అంటూ ఆమె ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు.

    Recommended Video

    Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
    ట్విట్టర్ ఖాతా పునరుద్దరణ

    ట్విట్టర్ ఖాతా పునరుద్దరణ

    తన మూడో పెళ్లిని టార్గెట్ చేస్తూ వివాదం సృష్టిస్తున్న నటి లక్ష్మి రామకృష్ణన్, కస్తూరి, నాంజిల్ విజయన్, రవిందర్ చంద్రశేఖరన్, సూర్యాదేవిలపై రెండు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. అలాగే ట్విట్టర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ట్రోల్స్ గురైన వనితా విజయ్ కుమార్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్దరించుకొన్నారు. రెండు రోజుల క్రితం ట్విట్టర్ ఖాతాను ఆమె డీ యాక్టివేట్ చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    Vanitha Vijayakumar rendered apology over controversial comments on Thanjavur people. My fellow brothers and sisters from #Tanjore ...kindly dont misinterpret my anger and tone to another issue as disrespectful to you..I am very sorry if I unintentionally said anything that may have hurt your feelings...endrendrum thalaivanungugiren en thanjai mannirku 🙏
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X