నయన, ప్రభుదేవాను కెలికిన వనితా విజయ్ కుమార్.. ఫ్యాన్స్ ఆగ్రహంతో ట్విట్టర్ క్లోజ్.. ఏం జరిగిందంటే

తమిళ నటి, బిగ్‌బాస్ ఫేం వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లితో పీకల్లోతు వివాదాల్లోకి కూరుకుపోతున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు, యూట్యూబ్ ఇంటర్వ్యూలు, లైవ్ షోలో డిబేట్స్‌, ట్విట్టర్‌లో అగ్రెసివ్ కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ సందర్భంలో తన వ్యకిగత జీవితాన్ని నయనతార బ్రేకప్స్‌తో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తమిళ పరిశ్రమలో దుమారం లేస్తున్నది. వనితా విజయ్ కుమార్‌పై నయనతార ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంతకు వనితా విజయ్ కుమార్ చేసిన కామెంట్స్ ఏమిటంటే..

Recommended Video

నయనతార బ్రేకప్స్‌ పై వనితా విజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు!! || Oneindia Telugu
మూడో పెళ్లితో వనిత తంటాలు..

మూడో పెళ్లితో వనిత తంటాలు..

గతనెల తమిళ సినిమా పరిశ్రమలో వీఎఫ్ఎక్ష్ డిజైనర్ పీటర్ పాల్‌ను వివాహం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. తన మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండానే వనితా విజయ్ కుమార్‌ను పీటర్ పాల్ వివాహం చేసుకోవడంతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తలెత్తిన వివాదాలపై పలువురు సినీ, సామాజిక కార్యకర్తలు వనితా విజయ్ కుమార్, పీటర్ పెళ్లిని తప్పుపట్టడం తమిళ పరిశ్రమలో పెద్ద దుమారం లేపింది.

 తనపై దాడిపై ఘాటుగా వనితా విజయ్ కుమార్

తనపై దాడిపై ఘాటుగా వనితా విజయ్ కుమార్

తాజాగా తనపై వ్యక్తిగతంగా జరుగుతున్న దాడిపై వనిత విజయ్ కుమార్ ఘాటుగా స్పందిస్తున్నారు. తనపై పెరుగుతున్న దాడి నేపథ్యంలో వనితా విజయ్ కుమార్ మంగళవారం తన మానసికంగా అదుపు కోల్పోయారు. తన పెళ్లిని రాద్దాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుదేవాతో నయనతార సహజీవనం చేయలేదా అంటూ ప్రశ్నించారు. తనపై దాడి చేస్తున్న లక్ష్మీ, కస్తూరీను ఉద్దేశించి నయనతార అఫైర్‌ను కోట్ చేస్తూ ట్వీట్ చేశారు.

 లక్ష్మీ, కస్తూరికి ఘాటుగా రిప్లై

లక్ష్మీ, కస్తూరికి ఘాటుగా రిప్లై

నటి లక్ష్మీ రామక‌ృష్ణన్, కస్తూరికి ఘాటుగా జవాబిచ్చేందుకు ప్రయత్నిస్తూ.. మీరు నయనతారను Bitch (బూతు) అని అనగలరా? ప్రభుదేవా తన భార్యకు ఇవ్వకుండానే నయనతార ఆయనతో సహజీవనం చేశారు. ప్రభుదేవ భార్య రమాలత గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మీడియా, కోర్టుల చుట్టు తిరిగారు. ఆమె గురించి ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు.

నయనతార ఫ్సాన్స్ మండిపాటు

నయనతార ఫ్సాన్స్ మండిపాటు

నయనతార అఫైర్ గురించి ట్వీట్ చేయడంపై ఆమె ఫ్యాన్స్ వనిత విజయ్ కుమార్‌పై మండిపడుతున్నారు. వనిత విజయ్ కుమార్‌పై నెటిజన్లు మాటల యుద్దం ప్రకటించడంతో కంగుతిన్నారు. నయనతార ఫ్యాన్స్ తాకిడికి తట్టుకోలేక వనితా విజయ్ కుమార్ తన ట్వీట్‌ను తొలగించి.. తన ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డీయాక్టివేట్ చేశారు. ఇప్పటికీ ఆమె అకౌంట్ ఇంకా డీయాక్టివేషన్‌లోనే ఉండటం గమనార్హం.

 గత రెండురోజులుగా సోషల్ మీడియాలో

గత రెండురోజులుగా సోషల్ మీడియాలో

గత కొద్దిరోజులుగా వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లిపై సోషల్ మీడియాలో వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి. కుట్టి పద్దిని, కస్తూరి శంకర్, లక్ష్మీ రామకృష్ణన్, నిర్మాత రవిందర్, తమిళ కమెడియన్ నాంజిల్ తదితరులు వనిత విజయ్ కుమార్‌ను టార్గెట్ చేసుకొంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో దిక్కు తోచని పరిస్థితుల్లో తప్పుదారిలో నయనతార పేరు ఎత్తుకోవడం ఆమెకు పెద్ద షాకే తగిలేటట్టు కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X