For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మూడో పెళ్లి మూన్నాళ్ల ముచ్చటే!.. ఇలాంటివి నాకు కొత్తేమీ కాదు.. వనిత సంచలన ట్వీట్స్

  |

  వనిత విజయ్ కుమార్ గత వారం క్రితమే గోవాలో తన భర్త పీటర్ పాల్‌తో కలిసి సందడి చేసింది. గోవాలో తన 40వ బర్త్ డే వేడుకలను పీటర్ ఘనంగా సెలెబ్రేట్ చేశాడు. ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టే కనిపించారు. తాజాగా ఈ ఇద్దరిపై సంచలన వార్తలు బయటకు వచ్చాయి. మద్యం మత్తులో పీటర్ అసభ్యంగా ప్రవర్తించడంతో పీటర్ పాల్‌ను వనిత తన్నీ తరిమేసిందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వీటిపై వనిత స్పందిస్తూ వరుసగా ట్వీట్ల మీద ట్వీట్లు చేసింది. ఆమె చేసిన ట్వీట్ల సారాంశం ఏంటంటే..

  ప్రేమించుకున్నాం.. నవ్వుకున్నాం..

  ప్రేమించుకున్నాం.. నవ్వుకున్నాం..

  ఏవరైతే తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారో.. ఎవరైతే నేను ఇంటిని విడగొట్టానని అనుకుంటున్నారో.. వారికి చెప్పదలుచుకుంటున్నాను. ఎన్నో యేళ్లు ఓ ఫ్యామిలీ, ఇళ్లు లేని అతనికే ఇంటిని ఇచ్చాను. కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ, మీడియాలో మమ్మల్ని బలి చేస్తున్న సమయంలనూ మేము ప్రేమించుకున్నాం.. నవ్వుకున్నాం.. సరదాగా ఉన్నాం. నాకు తెలిసి మమ్మల్ని ఏది విడగొట్టలేదు. అదే నేను నమ్ముతున్నాను. ఆపై మళ్లీ ఆయన ఆరోగ్యం చెడిపోయింది. ఆప్పుడు నేను మొత్తం కూలిపోయాను. ఒక్క నెల గ్యాప్‌లోనే ఇలా దెబ్బ మీద దెబ్బ పడటంతో కుంగిపోయాను. కానీ ఆ దేవుడికి మాత్రం ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకుంటే ఆయన్ను మళ్లీ పూర్తి ఆరోగ్యం వంతుడిగా ఇంటికి వచ్చేలా చేశాడన వనిత ఎమోషనల్ అయింది.

  నిజాయితీ, ముక్కుసూటిగా..

  నిజాయితీ, ముక్కుసూటిగా..

  మనం ప్రేమించిన వారికి ఏదైన జరిగినా, ఏదైన అనారోగ్యానికి గురైనా మన జీవితం మారుతుంది. అతన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాది.. ఆయన్ను పోగొట్టుకున్న బాధను నేను ఎప్పుడు భరించలేను. ఈ రోజు కూడా అదే బాధను నేను అనుభవిస్తున్నాను. కొంతమంది శాడిస్ట్‌లు మాత్రం ఇప్పటికీ మా జీవితాల్లో తొంగి చూసి, మా విషయాలను రచ్చకీడ్చి దాన్నుంచి డబ్బు, క్రేజ్ సంపాదించుకోవాలని చూస్తున్నారు. అలాంటి వారు పక్కవాళ్ల బాధల్లోంచి సంతోషాన్ని వెతుక్కుంటారు. కానీ నేను ఓ నిజాయితీ పరురాలిని.. అంతకు మించి ముక్కుసూటి మనిషిని.. ఏదైనా జరిగితే నేనే నేరుగా ప్రపంచానికి చెబుతాను. నా దగ్గర దాచడానికి ఏమీ లేదు.. పైగా నేను ఏదీ దాచను కూడా. దీన్నే మీరు అడ్వాంటేజ్‌గా తీసుకోవడం మంచిది కాదు. కానీ నేను మరో ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాను. నేను దీన్ని ఎలా పరిష్కరించుకోగలనోనని ఆలోచిస్తున్నానని వనిత పేర్కొంది.

  ఇలాంటివి కొత్తేమీ కాదు..

  ఇలాంటివి కొత్తేమీ కాదు..

  నా గుండెలో ఇప్పుడు చెప్పలేనంత మోయలేనంతా బాధ ఉంది.. నాకు చాలా భయంగా ఉంది.. నాకు కావాల్సింది కేవలం ప్రేమే. అది కోల్పోతానేమోనన్న భయం ఉంది.. నా పని, నా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ పరిస్థితులను ఎదుర్కొవడానికి బోల్డ్‌గా ఉండాల్సి వస్తుంది. నా జీవితం మొత్తం ఎన్నో కష్టాలను అనుభవించాను.. ఇలాంటివి నాకు కొత్తేమీ కాదు.. ప్రేమను కోల్పోవడం చిన్న విషయమేమీ కాదు.. అలా కోల్పోయిన ప్రతీసారి నేను ఎంతో స్ట్రాంగ్ అవుతూ వచ్చానని వనిత చెప్పుకొచ్చింది.

  జీవితంలో గుణపాఠం..

  జీవితంలో గుణపాఠం..

  ప్రేమలో నమ్మడం, బాధపడటం ఎంతో కష్టంగా అనిపిస్తుంది.. అది భరించలేం.. కానీ ఒకానొక సమయంలో పూర్తిగా మూగబోవాల్సి వస్తుంది.. మన కళ్ల ముందే మన జీవితాలు నాశనం అవ్వడం భరించేలని బాధనిస్తుంది..అలాంటి పరిస్థితుల్లో కంట్రోల్ ఉండదు.. నేను ఇది చెప్పలేను కానీ.. అలాంటిది జరగకుండా ఉండాల్సింది. కానీ ఇది జీవితం. మనకు గుణపాఠం నేర్పిస్తుంది.. అయినా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. అయినా నేను ఎంతో స్ట్రాంగ్‌గా నిలబడ్డాను. ఎదుర్కొంటున్నాను. కానీ మీరు మాత్రం ఫేక్ ఆర్టికల్స్‌ను చూసి, చదివి ఓ అంచనాకు, అభిప్రాయానికి రాకండని వనిత కోరింది.

  కలలు కల్లలయ్యేలా..

  కలలు కల్లలయ్యేలా..

  మీరు నన్ను తిట్టడానికి, ఏడిపించడానికి నేను అర్హురాలిని కాదు.. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎవరికైతే ప్రేమ అవసరం ఉందో వారికి నేను ప్రేమను అందించాను. నా జీవితంలో కన్న కలలన్నీ కల్లలు అయ్యే పరిస్థితులో నేను ఉన్నాను. ఇప్పటికీ నేను పాజిటివ్‌గానే ఉన్నా గానీ ఏదో భయం వేస్తోంది. బోల్డ్ మహిళనైనా నేను నా జీవితంలో ఇలాంటివెన్నో చూశాను. ఇది కూడా మెల్లిగా అలా వెళ్లిపోతుందని నేను ఆశిస్తున్నాను అని వనిత చెప్పుకొచ్చింది

  భర్తపై ఆరోపణలు చేయను..

  భర్తపై ఆరోపణలు చేయను..

  కానీ మీరే ఏదో ఒకటి ప్రచారం చేయకండి.. అది నన్ను చాలా బాధపడుతుంది. ఒక్క ప్రేమే నన్ను ముక్కలు చేస్తోంది. నాకు అద్భుతాలు జరుగుతాయన్న నమ్మకం ఉంది.. ఒకరి కోసం ఎదురుచూస్తున్నాను.. ఇక ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నేను ఎదుర్కోనేందుకు రెడీగా ఉన్నాను. ఇక నేను ఎవ్వరికీ ఏది కూడా వివరించాలనుకోవడం లేదు. నా జీవితంలో ఎదురైన ఈ పరిస్థితిని నేనే డీల్ చేసుకోగలను. నా భర్తను బజారు కీడ్చి దాని ద్వారా సింపతీ, మంచితనం సంపాదించుకోవాలని నేను చూడనంటూ వనిత పేర్కొంది.

  #ShameOnVijaySethupathi: Netizens Slams Vijay Sethupathi | Muralitharan Biopic '800 |Oneindia Telugu
  అద్భుతం జరుగుతుందనే ఆశ

  అద్భుతం జరుగుతుందనే ఆశ

  ఇది నేను ఊహించని ఘటన.. కానీ జరిగింది.. నా పిల్లలు, నా చుట్టు పక్కల ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సిన సమయమిది. నాకింకా అద్భుతాలు జరుగుతాయన్న నమ్మకం, ఆశ ఉంది.. కానీ అది జరగ్గకపోయినా ముందుకు కదులుతాను.. ఏం జరిగినా జీవితంలో ముందుకు కదలాల్సిందే. ఏది కూడా నన్ను బ్రేక్ చేయలేదు.. ఈ పరిస్థితిని నేను వదిలేయడం లేదని చివరగా చెప్పదలుచుకున్నానని వనితా విజయ్ కుమార్ ట్వీట్ చేసింది.

  English summary
  Vanitha VijayaKumar Emotional Tweets On Beating And Throwing Peter Paul, To those who think I broke a home..I made a home with someone who didn't have a home and family for many years..he was in pain and so was I..we loved laughed and lived thru the worst times beginning from covid pandemic to the media circus which was purposely created around us.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X