విడాకులు తీసుకొంటే.. అదేమైనా మర్డరా? రేపా? కస్తూరిపై వనిత విజయ్ కుమార్ ఫైర్
తమిళ నటి, బిగ్‌బాస్ ఫేం వనితా విజయ్ కుమార్ ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో ట్రెండింగ్‌గా మారారు. సినీ ప్రముఖుడు పీటర్ పాల్‌తో పెళ్లి తర్వాత నెలకొన్న పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా మారుతున్నాయి. కస్తూరి శంకర్, లక్ష్మీ రామకృష్ణన్, వెన్నిల శంకర్ లాంటి వారితో ట్విట్టర్‌లో వాగ్వాదానికి దిగారు. సోమవారం ఉదయం నుంచి వరుసగా ట్వీట్లు చేస్తూ సంచలనం రేపారు. ఇంతకు ఈ విషయంలో ఏం జరిగిందటే..
Recommended Video

నాపై నమోదైన కేసులతో
తమ పెళ్లిపై నమోదైన కేసులపై వనితా విజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఫ్యామిలీ కోర్టులు ఓపెన్ అయిన తర్వాత ఆమె (పీటర్ పాల్ భార్య) ఏమి కోరుకొంటుందో అది ఆమెకు దక్కుతుంది. ఇప్పుడు అరిచి గోలపెట్టినా ఏమీ జరుగదు. న్యాయం కావాలని కోరడానికి ఇదే మర్డర్ కేసు కాదు రేప్ కేసు కాదు. నీకు ఏది లభించినా, లభించకపోయినా.. నేను, పీటర్ పాల్ ప్రేమలోఉన్నారు. భవిష్యత్‌లో కూడా కలిసే ఉంటాం అని వనితా విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.

చీప్‌గా, అమర్యాదగా మాట్లాడటం
వనిత విజయ్ కుమార్ గురించి ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆమె ఇలా చీప్‌గా, అమర్యాదపూర్వకమైన పదాలు వాడుతారు అని నేను అనుకోవడం లేదు. తన తప్పులు ఏమిటో తెలుసుకోకుండా సమాజంలో గౌరవప్రదంగా జీవించే ఇతరుల మీద పడి విమర్శించడం, మాటల దాడి చేయడం సరి కాదు. భవిష్యత్ ఏమిటో ఊహించుకోకుండా ఇప్పుటి పరిస్థితులను చూసి నీవేదో కలలు కంటున్నావు అని అన్నారు. దానికి సమాధానం ఇస్తూ.. మనం సమాజంలో ఆరోగ్యకరంగా ఉందని భావిస్తున్నారా? ఇలాంటి నీచమైన ప్రపంచంలో నీవు సరిపోతావని అనుకొంటున్నావా? అంటూ వనితా విజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు.

కస్తూరీ శంకర్‌పై ఘాటుగా
ఇక మరో ట్వీట్‌లో బిగ్‌బాస్ ఫేం కస్తూరి శంకర్‌పై వనితా విజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. కస్తూరీ ట్వీట్ చేస్తూ నీవు ఇంత చీప్‌గా మాట్లాడుతావని అనుకోలేదు అక్క. అసలూ ఊహించలేదు. నీ మాదిరిగానే వాళ్లు చెత్తగా సమాధానాలు ఇస్తున్నారు. అలాంటి వారితో గొడవపడి సమయాన్ని వేస్ట్ చేసుకోకు అని కస్తూరి అంటే.. నువ్వోక వేస్ట్ పీస్‌వి. బిగ్‌బాస్‌లో కూడా చెత్తగా మాట్లాడావు. అందుకే నా జీవితం నుంచి, నా ట్విట్టర్ నుంచి నిన్ను తొలగిస్తున్నాను అని వనితా విజయ్ కుమార్ ట్వీట్ పేర్కొన్నారు.

నా మాజీ భర్తలకు అగౌరవం తేలేదు
తన జీవితంపై వనితా విజయ్ కుమార్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. నా జీవితంలో నేను రెండుసార్లు విడాకులు తీసుకొన్నాను. కానీ నా మాజీ భర్తల ప్రతిష్టకు ఎలాంటి భంగం కలిగించలేదు. వారిని అప్రతిష్టపాలు చేయలేదు. వారి పట్ల భూటకపు ప్రేమను ప్రదర్శించలేదు. మన జీవితంలో జరిగే వాటిని భరిస్తూ ముందుకు పోవాల్సిందే అంటూ వనితా విజయ్ కుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కరోనా పరిస్థితుల్లో ఆనందంగా జీవించండి
కరోనా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆనందంగా జీవితాన్ని గడపాలి. ఎవరి గురించి ఆలోచించకుండా.. మరొకరు ఏమంటున్నారనే విషయాన్ని పట్టించుకోకుండా నా బతుకు నేను బతుకుతున్నాను. నేను ప్రేమించే వాళ్లందరు క్షేమంగా ఉన్నారు. వాళ్లు అలాగే క్షేమంగా ఉండాలని కోరుకొంటున్నాను అని మరో ట్వీట్‌లో వనిత కుమార్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











