ఒక్క భర్తతో ఉంటే నీవేమైనా ప్రతివతవా? లైవ్‌లో నటిపై వనితా విజయ్ కుమార్ బూతులు
బిగ్‌బాస్ ఫేం, నటి వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి తమిళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానెల్, టెలివిజన్ ఛానెల్స్‌లో మాటల యుద్ధం కొనసాగుతున్నది. లక్ష్మీ రామకృష్ణన్, కుట్టి పద్మిని, కస్తూరి శంకర్ తదితర సెలబ్రిటీలు వనితపై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే.. వనిత ఘాటుగా స్పందిస్తున్నారు. ఇటీవల సంయమనం కోల్పోయినట్టుగా కనిపిస్తున్న వనిత విజయ్ కుమార్ మాటల దాడిని పెంచేసింది. తాజా తమిళ ఛానెల్‌లో జరిగిన చర్చలో బూతులు పురాణం అందుకొన్నారు. వివరాల్లోకి వెళితే..
Recommended Video

నా పెళ్లి వల్ల వచ్చిన సమస్యేంటి?
తమిళ మీడియాలో ప్రముఖ ఛానెల్‌లో ఇటీవల బతుకు జట్కా బండి లాంటి షోను నిర్వహించే నటి లక్ష్మీ రామకృష్ణన్, వనితా విజయ్ కుమార్‌ను చర్చకు పిలిచారు. అయితే నేరుగా లక్ష్మిని కొన్ని ప్రశ్నలు అడుగుతానని వనితా డైరెక్టుగా రంగంలోకి దూకింది. నా పెళ్లి వల్ల నీకు వచ్చిన సమస్య ఏమిటి? అని గట్టిగా ప్రశ్నించింది. నీవు నాకు ఓ సమస్యగా మారావని గట్టిగా నిలదీసింది.

నీవేమైనా హైకోర్టు జడ్జీవా?
అయితే ఎదో కారణంగా ఇద్దరికి విడాకులు ఇచ్చాను. నాకు నచ్చి మూడో పెళ్లి చేసుకొన్నాను. నా పెళ్లి విషయంలో మంచిదా లేదా చెడా అనే విషయంపై తీర్పు ఇవ్వడానికి నీవు ఏమైనా మద్రాస్ హైకోర్టు జడ్జివా? నా వ్యక్తిగత జీవితంపై నీవు టెలివిజన్ షోల్లో తీర్పు చెప్పాల్సిన అవసరం ఏమున్నది. నా వ్యక్తిగత జీవితంపై కామెంట్ చేసే అవసరం నీకు ఏమిటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

ఒక్క భర్తతో ఉంటే ప్రతివతవా?
అయితే ఓ దశలో డిబేట్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన లక్ష్మా రామకృష్ణన్ ఆ తర్వాత మళ్లీ చర్చలోకి వచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. ఏడాదికో పెళ్లి చేసుకోవడం తప్పు అంటూ ఏదో చెప్పబోయింది. నీవు ఒక్క భర్తతో ఉంటే నీవేమైనా ప్రతివతవనుకొంటున్నావా? ఇతరులతో నీకు ఉన్న సంబంధాలను బయటపెడుతాను. నీవు ఉండే ఇండస్ట్రీలోనే నేను ఉంటున్నాను. నీ సంగతులన్నీ తెలుసు అంటూ వనితా విజయ్ కుమార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

నీ టెలివిజన్ షోతో కాపురాలు కూల్చుతున్నావు
ఇక అంతేకాకుండా లక్ష్మీ రామకృష్ణన్‌పై విరుచుకుపడుతూ.. కుటుంబ కలహాల నేపథ్యంగా నడిపే టెలివిజన్ షోతో కాపురాలు కూల్చుతున్నావు. టెలివిజన్ షోతో ఎన్నో సంసారాలను నాశనం చేస్తున్నావు. అలాంటి దానివి నీవు నాకు వైవాహిక జీవితం గురిచి చెబుతావా? నా లైఫ్‌పై చెత్త మాట్లాడటం మానేసి.. నీవు నడిపే షోలో కంటెంట్ దృష్టిపెట్టు. అంతేగానీ నా జోలికి వస్తే నేనేంటో చూపిస్తాను అని వనిత విజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.

నా భర్తలను మోసం చేయలేదు
తన మూడు పెళ్లిళ్లపై వనితా విజయ్ కుమార్ సమర్ధించుకొన్నారు. వ్యక్తిగత జీవితంలో ఏదో కారణంతో నేను వ్యక్తిగత విషయాల్లో సర్దుకోలేకపోయాను. నా భర్తలతో నాకు కలిసి జీవించడం కుదర్లేదు. అయినా నా భర్తలతో కలిసి కలిసి ఉన్నప్పుడు నీతిగా, నిజాయితీగా ఉన్నాను. నీ మాదిరిగా భర్తను మోసం చేయలేదంటూ లక్ష్మీ రామకృష్ణన్‌పై నిప్పులు చెరిగారు.


Click it and Unblock the Notifications











