వనిత విజయ్‌కుమార్ భర్తకు తీవ్ర అస్వస్థత.. పీటర్ పరిస్థితి విషమంగా.. దేవుడిపై భారం అంటూ
తమిళ నటి వనితా విజయ్ కుమార్ జీవితానికి మరో పరీక్ష మొదలైంది. ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకొనన మూడో భర్త తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యారు. దాంతో వనితా ఓ రకమైన బాధలో మునిగిపోయారు. తన భర్త పీటర్ పాల్‌ను హాస్పిటల్‌లో చేర్పించిన విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజా ఘటనపై ఆమె ట్వీట్ చేస్తూ..

జూన్‌లో పెళ్లి చేసుకోవడంతో
జూన్ మాసంలో వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకోవడం తమిళ పరిశ్రమలో సంచలనం రేపింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే వనితా విజయ్ కుమార్‌ను తమిళ సినీ ప్రముఖుడు పీటర్ పాల్ పెళ్లాడటం వివాదంగా మారింది. పీటర్ మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం గందరగోళంగా మారింది.

మూడో పెళ్లి వివాదంగా మారి..
వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ పెళ్లిపై సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తన పెళ్లిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై సినీ ప్రముఖులపై వనితా మండిపడ్డారు. ఇలాంటి అంశాలు దాదాపు నెలరోజులపాటు మీడియాలో రచ్చ రచ్చగా మారాయి. అయితే ఇప్పుడిప్పుడే వివాదాలు సద్దుమణుగుతున్నాయనే క్రమంలో వనితా విజయ్ కుమార్‌కు మరో కష్టం వచ్చి పడింది.

తీవ్ర అస్వస్థతకు గురైన పీటర్
వనితా విజయ్ కుమార్ మూడో భర్త పీటర్ పాల్ తీవ్ర అనారోగ్యంతో హస్పిటల్‌లో చేరారు. ఆయనక తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయాన్ని వనితా విజయ్ కుమార్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఆయన త్వరగా కోలుకోవాలని వనితా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

భర్త ఆరోగ్యంపై వనితా విజయ్ కుమార్ ఆవేదన
తన భర్త పీటర్ ఆరోగ్యంపై వనితా విజయ్ కుమార్ స్పందిస్తూ.. చాలా బాధను పంచుకోవాలి.. ఈ పరిస్థితుల్లో ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు. దేవుడుపైనే భారం వేశాను. ఇలాంటి పరీక్షలు నాకే ఎందుకు వస్తున్నాయో అర్ధం కావడం లేదు. జీవితం మరీ దుర్భరంగా మారింది అంటూ వనిత విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.
Recommended Video

కష్టాలు వచ్చినప్పుడే అంటూ వనితా ట్వీట్‌తో
భర్త పీటర్ హాస్పిటల్‌లో చేరడంపై వనితా విజయ్ కుమార్ విషాదానికి గురైంది. ఏది ఏమైనా విధి రాసిన రాతను తప్పించలేం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాల్సిందే. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడే మనమేంటో ప్రపంచానికి తెలుస్తుంది అంటూ వనితా విజయ్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











