కస్తూరి కాలసర్పం.. వ్యక్తుల జీవితాలపై విషం చిమ్ముతున్నది.. వనితా విజయ్ కుమార్ ఫైర్

తమిళ నటి, బిగ్‌బాస్ ఫేం వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. గత కొద్దికాలంగా తమిళ నటీనటులకు, వనితా విజయ్ కుమార్‌కు మధ్య గొడవలు ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నటి విజయలక్ష్మీ సూసైడ్ అంశం ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పింది. మరోసారి కస్తూరి శంకర్, వనితా విజయ్ కుమార్ మధ్య వాగ్వాదానికి తెర తీసింది. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Recommended Video

నయనతార బ్రేకప్స్‌ పై వనితా విజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు!! || Oneindia Telugu
నటి విజయలక్ష్మీ సూసైడ్ అటెంప్ట్

నటి విజయలక్ష్మీ సూసైడ్ అటెంప్ట్

తమిళ సూపర్ స్టార్ విజయ్‌‌తో ఫ్రెండ్స్, బాస్ ఎంగిరా భాస్కరన్ లాంటి చిత్రాల్లో నటించిన విజయలక్ష్మీ ఆదివారం ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో ఉన్న విజయలక్ష్మీని కస్తూరి పరామర్శించారు.

విజయలక్ష్మికి కస్తూరి శంకర్ పరామర్శ

విజయలక్ష్మికి కస్తూరి శంకర్ పరామర్శ


అనంతరం కస్తూరి ట్వీట్ చేస్తూ.. హాస్పిటల్ చికిత్స పొందుతున్న విజయలక్ష్మి ఫ్యామిలీని కలిశాను. వారికి సాధ్యమైనంత మేరకు సహాయం చేశాను. విజయలక్ష్మీ సూసైడ్ అటెంప్ట్‌తో ఆ కుటుంబం మానసికంగా కుంగిపోయారు. ఊహించిన విషాదంతో ఓ రకమైన షాక్ గురయ్యారు. ఆమెతో కలిసి పనిచేయడమే కాకుండా జీవితాన్ని చాలా నిశితంగా పరిశీలించాను. విజయలక్ష్మీ చికిత్స కోసం గాయత్రి రఘురామ్ తీసుకొన్న చొరవకు థ్యాంక్స్ చెబుతున్నాను అని కస్తూరి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

విజయలక్ష్మీ గురించి కస్తూరి ట్వీట్

విజయలక్ష్మీ గురించి కస్తూరి ట్వీట్

విజయలక్ష్మీ ఆత్మహత్య వెనుక రాజకీయ ఒత్తిళ్లు, కారణాలు ఏమీ ఉండవని అనుకొంటున్నాను. ఉషా చెప్పిన వారి కష్టాలను గంటపాటు విన్నాను. చెప్పిన ప్రతీ విషయం కూడా కేవలం ఇద్దరి గురించే. కానీ వారు చేసిన ఆరోపణలు చాలా దిగ్బ్రాంతికి గురిచేశాయి. కానీ వాటిని మనం వాదించలేం. ఒత్తిళ్లు తగ్గితే అంతా సర్ధుకుంటాయనే అభిప్రాయాన్ని కస్తూరి శంకర్ వ్యక్తం చేశారు.

కస్తూరిపై వనితా విజయ్ కుమార్ మండిపాటు

కస్తూరిపై వనితా విజయ్ కుమార్ మండిపాటు


కస్తూరి శంకర్ ట్వీట్‌కు వనితా విజయ్ కుమార్ బదులిస్తూ.. ఓ మైగాడ్. వీరిని చూస్తే నాకు నిజంగా భయమేస్తున్నది. ఇలాంటి నకిలీ లాయర్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్టుగా, ఎఫ్‌బీఐ అధికారిగా వ్యవహరిస్తున్నది. ఈ విషయంలో అత్యంత దయనీయమేమిటంటే..ప్రతీ మహిళా సెలబ్రిటీ జీవితంలోకి తొంగి చూస్తూ.. దర్యాప్తు చేస్తున్నట్టు ఫోజు కొడుతున్నది.

కస్తూరి కాలసర్పం.. విషం చిమ్ముతున్నది

కస్తూరి కాలసర్పం.. విషం చిమ్ముతున్నది

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సున్నితమైన విషయాలను పబ్లిక్ చేస్తూ విమర్శిస్తున్నది. కొందరి వ్యక్తిగత జీవితాలపై కాలసర్పం మాదిరిగా విషం కక్కుతున్నది అంటూ కస్తూరి శంకర్‌పై ఘాటుగా వనితా విజయ్ కుమార్ ట్వీట్‌ చేశారు. దీంతో మళ్లీ కస్తూరి, వనితా కుమార్ మధ్య మాటల యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X