మా నాన్నకు 2 పెళ్లిల్లు.. నాకు 3 వివాహాలు.. వనితా విజయ్ కుమార్ షాకింగ్ కామెంట్

వివాదాస్పద నటి, తమిళ బిగ్‌బాస్ ఫేమ్ వనితా విజయ్ కుమార్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. పెళ్లిళ్ల విషయంలోనే కాకుండా ఇతరులపై విమర్శలను కుండబద్దలు కొట్టినట్టు అడ్డుకొంటుంది. అయితే ఎవరేమీ అనుకొంటారో అనే విషయాన్ని పట్టించుకోకుండా తన మనసులో ఏముంటుందో అదే విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తుంది. అయితే తాజాగా తన తండ్రి బహుభార్యత్వంపై ప్రశ్నలు సంధించడంతో ఆమె వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

వనితా విజయ్ కుమార్ తన వ్యక్తిగత జీవితం, వైవాహిక జీవితం అత్యంత వివాదాస్పదం. ఒకటి కాకుండా మూడు వివాహాలు చేసుకొని తమిళ మీడియాలోనే కాకుండా దక్షిణాది మీడియాలో కూడా వివాదాస్పదంగా మారారు. మూడో పెళ్లి చేసుకొన్న నెల రోజుల్లోనే భర్తతో విడాకులు తీసుకోవడం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

Vanitha Vijayakumar objectionable comments on Father Vijay Kumar s polygamous lifestyle

వనితా విజయ్ కుమార్ తన జీవితంలో మొదటి తెలుగు వ్యాపారవేత్త రాజన్‌ను వివాహం చేసుకొన్నారు. వారికి ఓ కూతురు పుట్టిన తర్వాత విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత మూడో భర్తగీ పీటర్ పాల్‌ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొన్నారు. అయితే ప్రస్తుతం ఆమె నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ఇక వనితా తండ్రి, ప్రముఖ నటుడు విజయ్ కుమార్ విషయానికి వస్తే.. తొలి వివాహం ద్వారా ముగ్గురు పిల్లల ఉన్నారు. ఆ తర్వాత తొలి భార్యకు విడాకులు ఇచ్చి.. ప్రముఖ నటి మంజులను పెళ్లి చేసుకొన్నారు. ఆమె ద్వారా మరో ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తన తండ్రి ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.

తాను మూడు పెళ్లిళ్లు చేసుకొని తన తండ్రి రెండు పెళ్లిళ్ల గురించి ప్రశ్నించడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు. అది జాతీయ ఛానెల్‌లో అలా ఎలా వివాదాస్పదంగా మాట్లాడుతారు? ఫ్యామిలీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ అని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె తీరును తీవ్రంగా తప్పపడుతున్నారు.

వనితా విజయ్ కుమార్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ.. నటిగా కూడా వ్యహరిస్తున్నారు. కొరియోగ్రాఫర్‌ రాబర్ట్ మాస్టర్‌తో కలిసి ఈ సినిమాలో కనిపించబోతున్నారు. టెలివిజన్ షోలు, తమిళ సినిమా రంగంలో మరింత యాక్టివ్‌గా ఉన్నారు. అయితే త్వరలోనే ఆమె నాలుగో పెళ్లి చేసుకొని శుభవార్తను అందిస్తారా అనేది త్వరలోనే తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X