ఎదిగిన ఇద్దరు కూతుళ్లు పక్కనే.. భర్తతో లిప్ లాక్.. వనితా విజయ్ కుమార్ పెళ్లి ఫోటోలు వైరల్
తమిళ, తెలుగు పరిశ్రమలో నటుడు విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన కుమారుడు అరుణ్ విజయ్ కుమార్ తమిళంలో హీరోగా సెటిలయ్యాడు. తెలుగులో విలన్‌గా, ముఖ్య పాత్రలను పోషిస్తున్నాడు. చివరగా సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇక ఈయన కూతుళ్లలో ఒకరు వనితా విజయ్ కుమార్. దేవి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన ఈమె తెలుగు ప్రేక్షకులకు అంతగా సుపరిచితురాలు కాదు. అయితే తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొనడంతో ఈమె మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తాజాగా మూడో పెళ్లి విషయాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

కలిసి రాని వివాహా బంధం..
వనితా విజయ్ కుమార్ వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడ లేకపోతున్నాయి. ఇప్పటికే రెండు వివాహా బంధాలు మధ్యలో ముగిసిపోయాయి. అందులో మొదటగా 2000లో ఆకాశ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. తన మొదటి భర్తతో విజయ్ శ్రీహరి అనే కుమారుడు కలిగాడు. ఆ తర్వాత వీరు విడాకులు తీసుకొన్నారు.

రెండో వివాహమూ అంతే..
ఆ తర్వాత ఆనంద్ జాయ్ రాజన్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత వారి అఫైర్ పెళ్లి వరకు వచ్చింది. దాంతో వారిద్దరూ 2007లో పెళ్లి చేసుకొన్నారు. అయితే ఏడేళ్ల కాపురం చేసిన తర్వాత మళ్లీ కథ మొదటికి వచ్చింది. వైవాహిక జీవితంలో కలతలు చోటు చేసుకోవడంతో వారిద్దరు విడిపోయారు. రాజన్‌తో వనితకు జోవితా, జయనిత అనే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు.

మూడో పెళ్లి..
ఆ తర్వాత పీటర్ పాల్‌తో అఫైర్ మొదలైంది. అతనితో పెళ్లికి సిద్దపడింది. ఈ మేరకు ఆ మధ్య ఓ పోస్ట్ చేస్తూ.. ‘నా జీవితంలోకి ఓ కలలా ప్రవేశించారు. నా లైఫ్‌లో ఏర్పడిన అఘాతాన్ని పూరించేశాడు. అతను నాతో ఉంటే సెక్యూర్‌గా, జీవితం పరిపూర్ణంగా అనిపించింది. లాక్‌డౌన్‌లో నా యూట్యూబ్ ఛానెల్‌కు సమస్యలు వస్తే టెక్నికల్‌గా సహాయం అందించారు. నేను కష్టాల్లో ఉంటే నాకు తోడుగా నిలిచారు' అని చెప్పుకొచ్చింది.
Recommended Video

కూతుళ్లను పక్కనే పెట్టుకుని..
తాజాగా వనితా-పీటర్ క్రిస్టియన్ సంప్రదాయ పద్దతిలో ఒక్కటయ్యారు. ఘాడమైన అదర చుంబనంతో ఫోటోలకు పోజులిచ్చారు. వీరి వివాహా వేడుకకు పిల్లిలిద్దరూ హాజరయ్యారు. వనిత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











