భుజం మీద చేతులు, చేతిలో మందు గ్లాసు.. వ్యక్తితో అతి సన్నిహితంగా.. క్లారిటీ ఇచ్చిన వనిత
ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ కంటే ఎక్కువగా ఫేమస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా వనితా విజయకుమారే. మూడో పెళ్లి చేసుకున్న వనితా అత్యంత వివాదాస్పదనమైన అంశాన్ని లేవెనెత్తింది. పీటర్ పాల్ అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది వనిత. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే పీటర్ పాల్ మాత్రం తన భార్య ఎలిజబెత్ హెలెన్‌కు విడాకులు ఇవ్వకుండానే వనితను పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. వీరి మధ్యలో సూర్యాదేవీ, లక్ష్మీ రామకృష్ణన్, కస్తూరీ శంకర్, నిర్మాత రవీంద్రన్ వంటి వారు వచ్చారు.

మీడియాలో వైరల్..
తమిళ నాట కరోనా విపరీతం పెరుగుతున్నా.. మీడియా మాత్రం వనిత సృష్టించిన వివాదంపైనే ఫోకస్ పెట్టింది. అంతలా మలుపులు తిరుగుతూ ఉంది వీరి వ్యవహారం. ఒకరిపై ఒకరు దూషించుకోవడం నిత్యం జరుగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో కొందరు వనితను తప్పుబడితే మరికొందరు వనితను చెడామడా తిట్టిపోస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియా, మీడియాలో వీరి వ్యవహారామే ప్రముఖంగా వినిపిస్తోంది.

పోలీసుల వద్దకు..
వనిత తనపై వస్తోన్న కామెంట్లకు విసిగెత్తి సూర్యాదేవీ, రవీంద్రన్, కస్తూరీ శంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబ్, మీడియాల్లో తమ గురించి చెడుగా మాట్లాడుతున్నారని, విమర్శలతో విసిగిస్తున్నారని వనిత ఫిర్యాదు చేసింది. అరెస్ట్‌లు, బెయిల్‌లు కూడా ఓ వైపు జరిగిపోతున్నాయి. ఈ సందులో ఓ ప్రైవేట్ ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది.

అత్యంత సన్నిహితంగా..
తాజాగా వనిత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అందులో ఓ వ్యక్తితో వనిత మరింత సన్నిహితంగా ఉంది. అతను వనిత భుజంపై చేతులు వేయగా.. ఆమె ఆయనపై వాలినట్టుగా ఉంది. అంతేకాకుండా ఇద్దరి చేతులో మద్యం గ్లాసులు కూడా ఉన్నాయి. ఇక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవ్వడంతో దానిపై వనిత క్లారిటీ ఇచ్చింది.
Recommended Video

వనిత క్లారిటీ..
ఆ వ్యక్తి తనకు సన్నిహితుడని, మంచి స్నేహితుడని వనిత చెప్పుకొచ్చింది. ఆయన భార్య కూడా పక్కనే ఉందని, కానీ ఎవరో కావాలనే ఆమె ఫోటోను కత్తిరించి తామిద్దరం ఉన్నది మాత్రమే లీక్ చేశారని తెలిపింది. అందులో తప్పేం ఉందని తిరిగి ప్రశ్నించింది.


Click it and Unblock the Notifications











