వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లి?.. అతడితో రిలేషన్‌షిప్‌లో.. క్లారిటీ ఇచ్చిన వివాదాస్పద నటి

తమిళ నటి, బిగ్‌బాస్‌ ఫేం వనిత విజయ్ కుమార్ మరోసారి మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది మూడో పెళ్లి చేసుకొని దక్షిణాదిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన వివాదాస్పద నటి మళ్లీ పెళ్లి వార్తల్లో మీడియా హెడ్‌లైన్స్‌ను ఆకర్షించింది. తాజాగా వనిత విజయ్ కుమార్ తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ...

పీటర్ పాల్‌తో మూడో పెళ్లి

పీటర్ పాల్‌తో మూడో పెళ్లి

గతేడాది జూన్ 27వ తేదీన తమిళ ఇండస్ట్రీకి చెందిన టెక్నిషియన్ పీటర్ పాల్‌ను మూడో వివాహం చేసుకోవడం మీడియాలో పెద్ద రచ్చగా మారింది. తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్తను పెళ్లి చేసుకొందని వనిత విజయ్ కుమార్‌పై పాల్ భార్య ఎలిజబెత్ హెలెన్ పోలీసు కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే పాల్‌కు విడాకులు ఇస్తూ వనితా విజయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు.

పాల్‌తో విడాకుల తర్వాత...

పాల్‌తో విడాకుల తర్వాత...

పీటర్ పాల్‌తో చేదు అనుభవం తర్వాత వనితా విజయ్ కుమార్ కెరీర్‌పై దృష్టిపెట్టారు. సినిమా ఆఫర్లు, టెలివిజన్ షోలతో బిజీగా మారారు. కుక్ విత్ కోమలి మొదటి సీజన్‌ షోలో మునుపటి కంటే మరింత అందంగా కనిపించింది. తన ఇమేజ్‌ను పాజిటివ్‌గా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడో పెళ్లి వల్ల వచ్చిన ఓ రకమైన ఇమేజ్‌ను మార్చుకొనేందుకు చర్యలు చేపట్టారు.

నాలుగో పెళ్లి అంటూ రూమర్లు..

నాలుగో పెళ్లి అంటూ రూమర్లు..

ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటున్న వనితా విజయ్ కుమార్ ఓ ప్రముఖ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అనే వార్త తమిళ మీడియాలో వైరల్ అయిది. త్వరలోనే నాలుగు పెళ్లి చేసుకోబోతున్నారనే విషయంపై తమిళ మీడియాలోను, ప్రముఖుల్లోను గుసగుసలు మొదలయ్యాయి. అయితే తన పెళ్లి వార్తపై వనితా విజయ్ కుమార్ స్పందించారు. ఆ రూమర్లకు తెర దించే ప్రయత్నం చేస్తున్నారు.

ట్విట్టర్‌లో వనితా విజయ్ కుమార్ క్లారిటీ

ట్విట్టర్‌లో వనితా విజయ్ కుమార్ క్లారిటీ

వనితా విజయ్ కుమార్ రిలేషన్‌షిప్‌లో ఉన్నదంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. మీకు ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకొన్నాను. మీరు ఊహిస్తున్నట్టు నాకు ఎవరితోను రిలేషన్‌షిప్ లేదు. నేను వెరీ మచ్ సింగిల్. నాలుగో పెళ్లి చేసుకొంటున్నట్టు నాపై రూమర్లు ప్రచారం చేయకండి. అలా వచ్చే వార్తలన నమ్మకండి అంటూ ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చారు.

వనితా విజయ్ కుమార్ సినిమా కెరీర్..

వనితా విజయ్ కుమార్ సినిమా కెరీర్..

వనితా విజయ్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. హిందీలో ఘన విజయం సాధించిన అంధాదూన్ చిత్రం ఆధారంగా తమిళంలో రూపొందుతున్న అంధాగన్ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో గోల్డ్ మ్యాన్‌గా పిలువబడే హరి నాడార్‌తో కలిసి 2K అజగనథు కాదల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. హరినాడార్ పనన్‌గట్టు పాడై అనే రాజకీయ పార్టీలో కూడా సభ్యుడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయని కొద్ది రోజుల క్రితం వనితా విజయ్ కుమార్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X