వనితా విజయ్ కుమార్‌కు మరో చేదు అనుభవం.. లైవ్‌లోనే భోరున ఏడుస్తూ..
బిగ్‌బాస్ ఫేమ్, తమిళ నటి వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి మూడునాళ్ల ముచ్చటే అయింది. ఎంతో ఇష్టంగా, వివాదాలను ఎదురించి చేసుకొన్న పెళ్లి మూడు నాలుగు నెలలు పూర్తి కాకుండా ముగిసి పోయింది. తాజాగా పీటర్ పాల్‌తో పెళ్లి పెటాకులైందని తాజాగా ఓ వీడియోను విడుదల చేసి ధృవీకరించారు. ఈ సందర్భంగా భోరున విలపిస్తూ.. తన బాధను వీడియోలో పేర్కొన్నారు. వనితా విజయ్ కుమార్ తాజాగా విడుదల చేసిన తన వీడియోలో..

పీటర్ పెళ్లికి ముందు... పెళ్లి తర్వాత
పెళ్లికి ముందు తెలిసిన పీటర్ పాల్.. పెళ్లి తర్వాత చూసిన ఆయనకు చాలా తేడా ఉంది. ధూమపానం, మద్యపానానికి బానిస అనే విషయం తెలిసే లోపే అంతా జరిగిపోయింది. ఆయనను నియంత్రణలో పెట్టాలని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి అని వనితా విజయ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో ఇంటిలో నుంచి తరిమివేసిందనే వార్తలు బయటకు వచ్చాయి.

నీ భర్తను నీకు దూరం చేశాను
నా వల్ల నీ జీవితం కష్టాల్లో పడింది. నేను చేసిన పనికి మీ కాపురం ఇబ్బందులకు గురైంది. పీటర్‌తో తిరిగి కాపురాన్ని నిలబెట్టుకోవాలని ఎలిజబెత్ హెలెన్‌కు సూచించింది. నీ భర్తను నీకు దూరం చేసినందుకు నేను క్షమాపణ చెబుతున్నాను అంటూ వీడియోలో వనితా విజయ్ కుమార్ తన వీడియోలో పేర్కొన్నారు.

కష్టకాలంలో వనితాకు అండగా మరో వ్యక్తి
వనితా భావోద్వేగంతో వీడియోలో మాట్లాడుతున్నప్పుడు ఒక మగ వ్యక్తి ఎవరో ఆమెకు డైలాగ్స్‌ను చెప్పడం వినిపించింది. అయితే నెటిజన్లు ఆ వ్యక్తి ఎవరా అంటూ ఆరా తీశారు. అయితే సరైన ఆధారాలు తెలియకపోవడంతో.. చివరకు వనితా విజయ్ కుమార్ లాయర్ అయి ఉంటారనే నిర్ధారణకు వచ్చారు. నా జీవితంలో సక్సెస్ అవుతాను అంటూ ఓ వ్యక్తి వెనుక నుంచి చదివి వినిపించడాన్ని నెటిజన్లు గుర్తించారు.

తాజా వీడియోలో భోరున ఏడుస్తూ..
గతంలో ఎలాంటి వివాదాలు తనకు ఎదురైనా ధైర్యంతో సమాధానం చెప్పేవారు. తాజాగా పీటర్‌తో విడిపోయిన సమయంలో చాలా ఎమోషనల్‌గా కనిపించారు. వీడియోలో మాట్లాడుతున్నంత సేపు భోరున విలపిస్తూ కనిపించారు. కన్నీళ్లు ధారగా కారుతుండగా వెక్కి వెక్కి ఏడ్చినంత పనిచేశారు. ఆమె పక్కనే మరొకరు ఉండి ఆమెకు సపోర్టుగా నిలుస్తూ.. మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేశారు.

మూడో పెళ్లితో కూడా చేదు అనుభవం
వనితా విజయ్ కుమార్ ముచ్చటపడి చేసుకొన్న మూడో వివాహం కూడా సత్పలితాన్ని ఇవ్వకపోవడం ఆమె జీవితంలో మరో విషాదంగా మారింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు కూడా సఫలం కాలేదు. ఇద్దరు కూతుళ్లు ఉన్న వనితా విజయ్ కుమార్ తోడు కోసం జూన్ 17 తేదీన తమిళ సినీ ప్రముఖుడు పీటర్ పాల్‌ను పెళ్లి చేసుకోవడం.. తాగుబోతు అనే కారణంతో విడిపోవడం ఇటీవల జరిగింది.


Click it and Unblock the Notifications











