ముద్దుకు కొత్త నిర్వచనం.. లస్ట్, కిస్ మధ్య తేడా అదే.. భర్తతో గాఢంగా వనితా విజయ్ కుమార్
వనితా విజయ్ కుమార్ గతకొన్ని రోజలుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. మూడో పెళ్లి చేసుకోవడం, అది కాస్తా రచ్చగా మారడం, సోషల్ మీడియాలో పలు రకాల వాదనలు వినబడటం, వాటిపై వనిత ఫైర్ అవ్వడంతో తెగ వైరల్ అవుతోంది. పీటర్ పాల్‌ను వనితా పెళ్లి చేసుకోవడం వరకు బాగానే ఉన్నా.. పీటర్ తన భార్య ఎలిజబెత్ హెలెన్‌కు విడాకులు ఇవ్వకుండా చేసుకోవడం అందరూ ఫైర్ అవుతున్నారు. ఈ విషయమై పీటర్ భార్య ఫిర్యాదు చేసింది. ఇక అక్కడి నుంచి ఈ విషయం పెద్ద చర్చకే దారి తీసింది.

మోసం చేశారు..
అది కేవలం షూటింగ్ కోసం చేసుకుంటున్న పెళ్లి అని తనను మోసం చేశారని ఎలిజబెత్ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా పీటర్ ఓ తాగుబోతు, స్త్రీలోలుడని చెప్పుకొచ్చింది. తన భర్త తనకు విడాకులు ఇవ్వకుండా ఎలా పెళ్లి చేసుకుంటాడని ఫైర్ అయింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

డబ్బుల కోసమే..
డబ్బుల కోసమే ఆమె ఈ నాటకం ఆడుతోందని వనిత ఆరోపించింది. ఆమెకు కావాలని ఇలా చేస్తోందని, తమను బ్లాక్ మెయిల్ చేస్తోందని, డబ్బు గుంజాలని ప్రయత్నిస్తోందని వనిత ఫైర్ అయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అందరూ వనితనే తప్పుబడుతున్నారు. విడాకులు కాకుండా ఎలా పెళ్లి చేసుకుంటావ్ అని ప్రశ్నిస్తున్నారు.

ముద్దు ఫోటో వైరల్..
వనిత, పీటర్ పెళ్లి రోజు వారిద్దరి గాఢ చుంభనం ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఆ లిప్ కిస్‌పై తెగ ట్రోలింగ్ జరిగింది. తాజాగా తన భర్త తన నుదుటిపై ముద్దు పెట్టిన ఫోటోను షేర్ చేసింది. అంతేకాకుండా ముద్దు, కామం రెండింటి తేడా కూడా చెప్పింది. ఓ తండ్రి కూతురికి మాత్రమే ముద్దుకు, కామానికి ఉన్న తేడా తెలుస్తుందని చెప్పుకొచ్చింది.
Recommended Video

భిన్న కామెంట్స్..
వనిత షేర్ చేసిన ఈ ఫోటో, పెట్టిన ట్వీట్‌పై భిన్న రకాల స్పందనలు వస్తున్నాయి. నువ్ చేసేది తప్పు.. నీ వల్ల ఓ మహిళకు అన్యాయం జరిగింది.. విడాకులు తీసుకోకుండా మళ్లీ పెళ్లి ఎలా చేసుకుంటావ్.. మీరిద్దరు తండ్రీ కూతుళ్లు కాదు కదా అని నానా రకాల కామెంట్లతో వనితను ఏకిపారేస్తున్నారు.


Click it and Unblock the Notifications











