వనితా మూడో పెళ్లి.. మొదటి భర్త కొడుకు పరిస్థితి అత్యంత దారుణంగా.. అన్నీ వదిలేసి..

వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ మూడో పెళ్లి తమిళ చిత్ర పరిశ్రమలో దుమారం లేపింది. వనితా పెళ్లి విషయం మీడియాలోను, సినిమా పరిశ్రమలో అత్యంత వివాదం రేపింది. తన భర్తతో పెళ్లి చట్ట విరుద్దం అంటూ పీటర్‌ కుటుంబ సభ్యులు అభ్యంతరం లేవనెత్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో వనితా మొదటి భర్త కుమారుడి పరిస్థితి దయనీయంగా మారిందనే విషయం తమిళ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇంతకు వనిత కుమారుడికి ఏమైందంటే..

వనతా విజయ్ కుమార్‌‌ కొడుకు గురించి

వనతా విజయ్ కుమార్‌‌ కొడుకు గురించి

నటి వనితా విజయ్ కుమార్‌కు మొదటి భర్త వల్ల కలిగిన 23 ఏళ్ల కుమారుడు విజయ్ శ్రీహరి ఉన్నాడు. వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి వివాదం మీడియాలో అత్యంత ప్రాధాన్యంగా మారడంతో ఆమె మొదటి భర్త ఆకాశ్ కుమారుడి తీవ్రమైన మానసిక వేధనకు గురయ్యాడు అని మొదటి భర్త ఆకాశ్ తన సన్నిహితులతో వాపోతున్నారట.

మొదటి భర్తతో లైఫ్

మొదటి భర్తతో లైఫ్

వనితా విజయ్ కుమార్ మొదటి భర్తతో పెళ్లి విషయానికి వస్తే.. తమిళ టెలివిజన్ రంగంలో నటుడిగా సుపరిచితులు. వనితతో విడాకుల తర్వాత మీడియాకు దూరంగా ఉండటానికి నటనకు స్వస్తి చెప్పారు. 2007 తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన వనితకు దూరంగా ఉంటున్నారు. వనిత, ఆకాశ్‌కు 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. 2007 వారిద్దరు విడాకులు తీసుకొన్నారు. తాజాగా వనిత మూడో పెళ్లి విషయంలో ఆకాశ్ కూడా మనస్తాపానికి గురయ్యాడనే సమాచారం.

 వనితా మూడో పెళ్లిపై అభ్యంతరాలు

వనితా మూడో పెళ్లిపై అభ్యంతరాలు

పీటర్ పాల్‌తో వనితా విజయ్ కుమార్ పెళ్లి తర్వాత పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే సినీ ప్రముఖుల అభిప్రాయాలను వనితా ఎలాంటి మొహమాటం లేకుండా తోసిపుచ్చింది. తమ వ్యక్తిగత జీవితం విషయంలో మీకు సంబంధం లేదు. మీ జీవితాలను మీరు సరిపెట్టుకోండి అంటూ వనితా అగ్గి మీద గుగ్గిలం అయ్యింది.

 తీవ్రమైన డిప్రెషన్‌లోకి విజయ్ శ్రీహరి

తీవ్రమైన డిప్రెషన్‌లోకి విజయ్ శ్రీహరి

తన కుమారుడు విజయ్ శ్రీహరి బాహ్య ప్రపంచంతో సంబంధాలను తెంచుకొని ఒంటరిగా ఓ రకమైన రుగ్మతకు గురవుతున్నాడు. ఇంట్లోని వాళ్లతో గానీ, స్నేహితులతో గానీ మాట్లాడటం లేదు. సోషల్ మీడియాలో అత్యంత వివాదంగా మారడంతో వాటికి దూరంగా ఉంటున్నారు. ఆయన తీవ్రమైన డిప్రెషన్‌కు లోనయ్యారు అని మొదటి భర్త ఆకాశ్ తెలిపారు.

Recommended Video

Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
 జూన్ 27 జరిగిన పెళ్లి వివాదంలోకి

జూన్ 27 జరిగిన పెళ్లి వివాదంలోకి

ఇదిలా ఉండగా, జూన్ 27 తేదీన జరిగిన వేడుకలో వనితా విజయ్ కుమార్ తన మూడో భర్తగా పీటర్ పాల్‌ను స్వీకరించారు. క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగిన పెళ్లికి వనితా విజయ్ కుమార్ ఇద్దరు కూతుళ్లు కూడా హాజరయ్యారు. అయితే పీటర్ పాల్ వ్యక్తిగత జీవితం, అతని మద్యం అలవాట్లు, మహిళలతో అక్రమ సంబంధాలపై అనేక విమర్శలు, ఆరోపణలు రావడంతో పలువురు సినీ ప్రముఖులు వనితా విజయ్ కుమార్‌ను కొన్ని విషయాల్లో హెచ్చరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X